ఏపీలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఆందోళన బాట పట్టారు. తమ ఉద్యోగాలు పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేస్తూ.. చలో సీఎం క్యాంపు ఆఫీసుకు పిలుపునిచ్చారు సమగ్ర శిక్ష, కేజీబీవీ కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు. ఎన్నికల్లో ఇచ్చిన హామీని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ నిరసనకు దిగారు ఉద్యోగులు.
సమ్మె సందర్బంగా రాసుకున్న మినిట్స్ అమలు చేయాలని.. రాష్ట్ర వ్యాప్తంగా వున్నా 28వేల మంది కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ సిబ్బంది డిమాండ్ చేస్తున్నారు.
మొత్తం పది డిమాండ్లతో సీఎం క్యాంపు ఆఫీసు ముట్టడికి పిలుపునిచ్చారు సమగ్ర శిక్ష ఉద్యోగులు. వీఎంసీ నుండి సీఎం చంద్రబాబు ఇంటి వరకు ర్యాలీకి పిలుపునిచ్చారు ఉద్యోగులు. ఈ క్రమంలో వీఎంసీ దగ్గర భారీగా మోహరించారు పోలీసులు. ర్యాలీకి అనుమితి లేదంటూ ఉద్యోగులను అడ్డుకున్నారు పోలీసులు.
