కేరళలోని ఓ అపార్ట్ మెంట్ లో 300 మంది అస్వస్థతకు గురయ్యారు. కక్కనాడ్ లోని ఓ అపార్ట్ మెంట్లో ఈ ఘటన జరిగింది. అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌లో నివసిస్తున్న పిల్లలతో సహా 300 మందికి పైగా అస్వస్థకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌లో వేలాది కుటుంబాలు నివసిస్తున్నాయని ఇది తీవ్రమైన సమస్య అని అన్నారు కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ . ఈ ఘటనపై చర్యలు తీసుకోవాలని డైరెక్టరేట్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్‌ను కోరినట్లు తెలిపారు. 700 మందికి పైగా ప్రజలు అనారోగ్యంతో బాధపడుతున్నారని ఫ్లాట్ నివాసితులు నాకు చెప్పారు. కానీ ఆరోగ్య శాఖ నివేదిక ప్రకారం సుమారు 340 మంది చికిత్స పొందుతున్నారు.. ఐదుగురు ప్రస్తుతం ఆసుపత్రిలో ఉన్నారని వీణా జార్జ్ చెప్పారు.
ఎర్నాకులం నుండి వచ్చిన వైద్య బృందం అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌ను సందర్శించి..నీటిని పరిశీలించారని తెలిపారు. నివాసితులతో మాట్లాడి అనారోగ్యంతో ప్రైవేట్ ఆసుపత్రులలో చికిత్స పొందుతున్న వారి జాబితాను తీసుకున్నామని చెప్పారు.
అయితే కలుషిత నీల్లు తాగడం వల్ల అస్వస్థతకు గురయ్యారా? లేక..ఇతర ఆహార పధార్థాలు(బయటి నుంచి ఆర్డర్ చేసుకున్న ఫుడ్)తినడం వల్ల లేదా బయటకెళ్లి తినడం వల్ల అస్వస్థతకు గురయ్యారా అనేది తెలియదని అపార్ట్ మెంట్ అసొసియేషన్ తెలిపింది.
