సెల్ఫోన్ డ్రైవింగ్పై కేసులు..ఇప్పటివరకు 6,046 మందిపై నమోదు  

సెల్ఫోన్ డ్రైవింగ్పై కేసులు..ఇప్పటివరకు 6,046 మందిపై నమోదు  

హైదరాబాద్ సిటీ, వెలుగు: నగరంలో నిర్వహించిన స్పెషల్​డ్రైవ్​లో సెల్ ఫోన్ మాట్లాడుతూ బండ్లు నడుపుతున్న 6,046 మందిపై కేసులు పెట్టామని ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ జోయల్ డేవిస్ తెలిపారు. ఏప్రిల్ 3 నుంచి 9 వరకు నిర్వహించిన తనిఖీల్లో ఒకవైపు బైక్​లు నడుపుతూ.. మరో వైపు ఫోన్​మాట్లాడుతూ 5,810 మంది దొరికారన్నారు. అలాగే ఆటోడ్రైవర్లు 51 మంది, కార్లు, ఇతర వెహికల్స్ నడుపుతూ 185 మంది పట్టుబడినట్టు చెప్పారు. ఈ తనిఖీలు ఇక నుంచి నిరంతరం కొనసాగిస్తామన్నారు.