వెల్లువెత్తిన అభిమానం.. కాంగ్రెస్ విజయభేరి సభకు 60 వేల పై చిలుకు హాజరు

వెల్లువెత్తిన అభిమానం.. కాంగ్రెస్  విజయభేరి సభకు 60 వేల పై చిలుకు హాజరు

షాద్ నగర్, వెలుగు: రాష్ట్రంలో  రోజు రోజుకు పెరుగుతున్న జనాదరణ చూసి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఓర్వలేక పోతున్నాయని షాద్‌‌నగర్‌‌‌‌ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వీర్లపల్లి శంకర్ అన్నారు.  శనివారం షాద్‌‌నగర్‌‌‌‌ పట్టణంలో కాంగ్రెస్ విజయబేరీ సభ నిర్వహించారు.  ఈ సభకు సుమారు 60 వేల పై చిలుకు మంది హాజరయ్యారు.  హెలికాఫ్టర్ సాంకేతిక కారణాల వల్ల టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి విజయ భేరి సభకు హాజరు కాలేదు. అయినా కాంగ్రెస్  కార్యకర్తలు, నాయకులు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4  గంటల వరకు సభలో  రేవంత్ రెడ్డి కోసం వేచి చూశారు.  ఈ సందర్భంగా  కాంగ్రెస్ అభ్యర్థి వీర్లపల్లి శంకర్ మాట్లాడుతూ..  రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి, రేవంత్ రెడ్డికి వస్తున్న ఆదరణ చూసి రాష్ట్ర,  కేంద్ర ప్రభుత్వాలు ఓర్వలేకనే అడుగడుగునా ఆటంకాలు సృష్టిస్తున్నాయన్నారు. కాంగ్రెస్ పార్టీపై అభిమానంతో విజయభేరి సభకు ఇంత  పెద్ద ఎత్తున తరలి వచ్చిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు శంకర్ కృతజ్ఞతలు తెలియజేశారు.

5  రోజులు కష్టపడితే 5  ఏండ్ల పాలన మనదే..  

రానున్న 5  రోజులు కాంగ్రెస్ పార్టీ కార్యక్తలకు చాలా కీలకమైన రోజులని ఈ అయిదు రోజులు కష్టపడి పని చేస్తే కాంగ్రెస్ 5 ఏండ్ల పాలనలో అందరూ సంతోషంగా ఉండొచ్చని మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి అన్నారు.  లక్ష 30  వేల  కోట్లతో  కాళేశ్వరం ప్రాజెక్ట్  కట్టి గోదావరి పాలు చేసిండని ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో 47 లక్షల మంది నిరుద్యోగులు పరీక్ష రాస్తే పేపర్ లీకేజీల పేరుతో వారిని రోడ్డున పడేశారన్నారు.  రాష్ట్రంలో ఊరూరా బెల్టు షాపులు పెట్టి యువతను చెడు దారి పట్టిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.  నవంబర్ 30న కాంగ్రెస్ పార్టీకి ఓటు గెలిపించాలని కోరారు.  కార్యక్రమంలో జడ్పీటీసీలు వెంకట్రామి రెడ్డి, తాండ్ర విశాల ఎంపీపీ ప్రియాంక, మాజీ జడ్పీటీసీ శ్యామ్ సుందర్ రెడ్డి,  సీనియర్ నాయకులు రఘు, బాబర్ ఖాన్, తాండ్ర శ్రావణ్ రెడ్డి, మాజీ ఎంపీపీ శివ శంకర్  ఉన్నారు.