
రాష్ట్ర వ్యాప్తంగా పరిషత్ ఎన్నికల పోరులో తొలి విడత పోలింగ్ ముగిసింది. జడ్పీటీసి, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి జరిగిన మొదటి విడత ఓటింగ్ లో దాదాపు 76.80 శాతం పోలింగ్ నమోదు అయినట్లు ఎన్నికల సంఘం అధికారికంగా వెల్లడించింది. అత్యధికంగా యాదాద్రి జిల్లాలో 86.19 శాతం, అత్యల్పంగా మంచిర్యాల జిల్లాలో 66.86 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు.