ముంబై: గ్లోబల్ ట్రావెల్ టెక్ యూనికార్న్ ఓయో పేరెంట్ కంపెనీ ప్రిజమ్ఐపీఓ ద్వారా రూ.6,650 కోట్లు సేకరించేందుకు సెబీ అనుమతి పొందింది. ఈ ప్రతిపాదిత పబ్లిక్ ఆఫరింగ్ ద్వారా కంపెనీ విలువ రూ.58 వేల కోట్ల నుంచి రూ.67 వేల కోట్లు ఉంటుందని అంచనా. ప్రిజమ్గత డిసెంబరులో కాన్ఫిడెన్షియల్ ఫైలింగ్ విధానంలో ఐపీఓ డాక్యుమెంట్లను సెబీకి అందజేసింది. అదేనెల 20న జరిగిన అసాధారణ సాధారణ సమావేశం (ఈజీఎం) లో వాటాదారుల ఆమోదం లభించింది. కొత్త ఈక్విటీ షేర్ల జారీ ద్వారా రూ.6,650 కోట్ల వరకు సేకరించేందుకు కంపెనీకి గ్రీన్‌సిగ్నల్ వచ్చింది.
