బాల్ తలకు తగిలి కుప్పకూలిన బౌలర్

బాల్ తలకు తగిలి కుప్పకూలిన బౌలర్

హైదరాబాద్ : క్రికెట్ లో బ్యాట్స్ మన్ కొట్టిన బాల్ తగిలి ప్లేయర్లు గాయపడుతుంటారు. అప్పుడప్పుడు అవి మనిషి ప్రాణాల మీదకు తెస్తుంటాయి. కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్ లో అదృష్టం కొద్దీ ఓ బౌలర్ ప్రాణాపాయం తప్పించుకున్నాడు. ముస్తాక్ ఆలీ టీ20 టోర్నమెంట్ లో భాగంగా జరిగిన మ్యాచ్ లో పేసర్ అశోక్ డిండా గాయపడ్డాడు. డిండా బాల్ వేసి ఫాలో త్రూలో ఉండగానే… బ్యాట్స్ మన్ స్ట్రైట్ షాట్ ఆడాడు. ఆ బాల్ వేగంగా వెళ్లి బౌలర్ నుదురును తాకింది. అంతే… బౌలర్ డిండా అక్కడే కుప్పకూలిపోయాడు. కళ్లు తిరిగి అక్కడే పడిపోయిన డిండాకు.. మెడికల్ సిబ్బంది ట్రీట్ మెంట్ ఇచ్చారు. గ్రౌండ్ నుంచి బయటకు తీసుకెళ్లి హాస్పిటల్ లో చేర్చారు. సీటీ స్కాన్ చేసిన డాక్టర్లు ప్రాణాపాయం లేదని.. రెస్ట్ అవసరమని చెప్పారు. బౌలర్ అశోక్ డిండా.. తన కోటాలో వేసిన చివరి బంతి అదే.