భారతీయ-అమెరికన్ టీవీ దిగ్గజం, ఆహార నిపుణరాలు పద్మాలక్ష్మీని యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ (UNDP) గుడ్‌విల్ అంబాసిడర్‌గా నియమితులయ్యారు . ప్రపంచవ్యాప్తంగా అసమానతలకు వ్యతిరేకంగా, సాధికారత కోసం పోరాటంలో ఆమె సహకరిస్తారని UNDP చెప్పింది. ప్రపంచ మహిళ దినోత్సవంలో UNDP అడ్మినిస్ట్రేటర్ అచిం స్టెయినర్ ఈ విషయాన్ని ప్రకటించారు. అనేక దేశాలు పేదరికాన్ని చాలా వరకు తగ్గించినప్పటికీ లింగ, వయో, జాతి, తెగ అసమానతలను మాత్రం తగ్గించలేకపోతున్నాయని పద్మాలక్ష్మి అన్నారు.
