ఇడ్లీ, దోశ, ఉప్మా.. బ్రేక్ఫాస్ట్లో మాత్రమే తింటారు చాలామంది. అయితే, వీటినే కొంచెం వెరైటీగా చేసుకుంటే సాయంత్రం స్నాక్, డిన్నర్ ఐటమ్ కూడా తినొచ్చు. పైగా పిల్లలు కూడా ఇలాంటి కొత్త వంటకాలను ఇష్టంగా తింటారు. అలాంటివే ఇది....ఎప్పుడైనా తినొచ్చు...
కావలసిన పదార్థాలు:
ఇడ్లి పిండి : 10 ఇడ్లీలకు సరిపడేంత, కర్జూరాలు: 10, జీడిపప్పు: 20, కిస్మిస్ :20, బాదంపప్పు 10, చెర్రీస్ : 6, నెయ్యి: రెండు టేబుల్ స్పూను, పచ్చి కొబ్బరి తురుము: అరకప్పు, క్యారెట్ తురుము: అర కప్పు, తేనె: నాలుగు టేబుల్ స్పూన్లు
డ్రైఫ్రూట్స్ ని చిన్న ముక్కలుగా చేయాలి. తర్వాత ఇడ్లీ ప్లేట్లలో పిండి వేసి ఓ మాదిరి మంట మీద ఉడికించాలి. సగం ఉడికిన తర్వాత ఇడ్డీలపై డ్రైఫ్రూట్స్ ముక్కలు వేసి మూత పెట్టాలి. బాగా ఉడికిన ఇడ్లీలను పేట్టలోకి తీసుకొని పైన కొద్దికొద్దిగా నెయ్యి వేసి దాని మీద క్యారెట్ తురుము, కొబ్బరి తురుము, తేనె వేసి, చెర్రీస్లో గార్నిష్ చేస్తే చాలు. డ్రై ఫ్రూట్ ఇడ్లీ రెడీ.
