నా భూమిని కబ్జా చేస్తున్నరు..కేటీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కలిసిన మొగిలయ్య

నా భూమిని కబ్జా చేస్తున్నరు..కేటీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కలిసిన మొగిలయ్య

హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వం తనకు కేటాయించిన భూమిని కొంత మంది కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారంటూ కిన్నెర వాయిద్యకారుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత దర్శనం మొగిలయ్య.. బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వద్ద మొర పెట్టుకున్నారు. శనివారం కేటీఆర్ ఇంటికెళ్లి తన సమస్యలను చెప్పుకున్నారు. హయత్ నగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో తనకు ప్రభుత్వం కేటాయించిన 600 గజాల స్థలాన్ని కొందరు కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని చెప్పారు.