‘పేజెస్‌‌‌‌’ .. ఫిమేల్‌‌‌‌ ఓరియెంటెడ్ ఫ్యామిలీ డ్రామా

‘పేజెస్‌‌‌‌’ .. ఫిమేల్‌‌‌‌ ఓరియెంటెడ్ ఫ్యామిలీ డ్రామా

అమెరికాలో స్థిరపడ్డ తెలుగు ఫిల్మ్ మేకర్  రామ్ అల్లాడి చిసెల్డ్, రాస్ మెటానోయా లాంటి చిత్రాలతో పలు ఇంటర్నేషనల్ అవార్డ్స్‌‌‌‌ అందుకున్నారు. ఆయన ప్రస్తుతం ‘పేజెస్‌‌‌‌’ అనే ఫిమేల్‌‌‌‌ ఓరియెంటెడ్ ఫ్యామిలీ డ్రామాను రూపొందిస్తున్నారు. కల్పనా తివారి లీడ్‌‌‌‌ రోల్‌‌‌‌లో నటిస్తోంది. తెలుగు, హిందీ, ఇంగ్లీష్‌‌‌‌, బెంగాలీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో తెరకెక్కిస్తున్నారు. 

ఇటీవల విడుదలైన ఈ మూవీ టీజర్‌‌‌‌, ఆసక్తికరంగా ఉండటంతో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ‘సామాజిక స్వేచ్ఛకు, వ్యక్తిగత స్వేచ్ఛకు మధ్య ఉన్న వ్యత్యాసమే ఇందులో ప్రధానాంశం. స్వాతంత్య్రానంతర పరిణామాల వల్ల ప్రభావితమైన ఓ రాజకీయ కుటుంబ నేపథ్యంలో సాగే కథ ఇది. పాకిస్తాన్ సరిహద్దుతో పాటు ఢిల్లీ, బంగ్లాదేశ్, తెలంగాణ ప్రాంతాలతో ముడిపడిన కథ. హైదరాబాద్, వరంగల్ పరిసర ప్రాంతాల్లో షూట్ చేస్తున్నాం’ అన్నారు.