హైదరాబాద్, వెలుగు: విశ్వహిందూ పరిషత్ తెలంగాణ రాష్ట్ర ధర్మాచార్య సంపర్క ప్రముఖ్‌గా పగుడాకుల బాలస్వామి నియమితులయ్యారు. ఇటీవల జరిగిన వీహెచ్ పీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో ఆయనకు ఈ బాధ్యతలు అప్పగించారు. ఈ సందర్భంగా బాలస్వామి మాట్లాడారు.
రాష్ట్రంలోని పీఠాధిపతులు, మఠాధిపతులు, సాధూసంతులను సమన్వయం చేస్తూ ధర్మ రక్షణ కోసం పనిచేస్తానని తెలిపారు. ఆలయాలు, ఆశ్రమాల కేంద్రంగా హిందుత్వాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పారు. కులాల మధ్య అంతరాలను తొలగించి, హిందూ సమాజం అంతా ఒక్కటేనన్న భావన తెస్తామని పేర్కొన్నారు. ప్రలోభాలకు గురై మతం మారిన వారిని తిరిగి స్వధర్మంలోకి తీసుకువస్తామని స్పష్టం చేశారు.
