వెరీ షాకింగ్ : పహల్గాం టెర్రరిస్టులు ఇంకా కాశ్మీర్లోనే దాక్కున్నారంట..!

వెరీ షాకింగ్  : పహల్గాం టెర్రరిస్టులు ఇంకా కాశ్మీర్లోనే దాక్కున్నారంట..!

జమ్మూకాశ్మీర్ పహల్గాంలో మన టూరిస్టులపై దాడి చేసి.. 28 మందిని పొట్టనపెట్టుకున్న కిరాతకులు.. ఉగ్రవాదులు ఇంకా కాశ్మీర్ లోనే ఉన్నారంట.. పాకిస్తాన్ పారిపోలేదంట.. కాశ్మీర్ లోనే సురక్షితమైన ప్రాంతంలో ఉన్నారంటూ వస్తున్న వార్తలు సంచలనంగా మారాయి. ఈ టెర్రిస్టులు ఇండియా సరిహద్దులు దాటి.. పాకిస్తాన్ పారిపోయి ఉంటారనే అనుమానాలను పటాపంచలు చేస్తూ.. జాతీయ భద్రతా దర్యాప్తు సంస్థ.. NIA వర్గాలు చెబుతున్నాయి. పహల్గాం టెర్రరిస్టులు ఇంకా కాశ్మీర్ లోనే ఉన్నట్లు NIA వర్గాల సోర్స్ గా వస్తున్న వార్తలు సంచలనంగా మారాయి. వాళ్ల కోసం ఇప్పుడు మన సైన్యం జల్లెడపడుతుంది. కాశ్మీర్ ను అణువణువు వెతుకుతోంది. కనిపిస్తే కుక్కల్లా కాల్చి చంపటానికి రెడీగా ఉంది..

భారత గడ్డపై మారణ హోమం సృష్టించిన ఉగ్రవాదులు.. ఇప్పటికీ కశ్మీర్ లోనే తలదాచుకున్నారనే వార్త షాకింగ్ కు గురిచేస్తోంది. పహల్గాం దాడి తర్వాత ఆర్మీ, భద్రతా బలగాలు, ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు అన్నీ అలర్ట్ అయ్యి టెర్రరిస్టుల కోసం గాలింపు చర్యలు నిరంతరం జరుపుతూనే ఉన్నాయి. మరోవైపు ఉగ్రవాదులను ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్ కు తగిన బుద్ధి చెప్పేందుకు భారత్ ఇప్పటికే సిద్ధమైంది. ఈ పరిస్థితుల్లో టెర్రరిస్టులు ఎప్పుడో పాక్ కు పారిపోయి ఉంటారని నిఘా వర్గాలు భావించాయి. కానీ ఇంకా కశ్మీర్ లోనే ఉన్నారనే వార్త సంచలనంగా మారింది. 

నిఘా వర్గాల ప్రకారం దాడిలో పాల్గొన్న టెర్రరిస్టులే కాకుండా మరికొంత మంది ఘటనా స్థలంలో ఉన్నట్లు తెలుస్తోంది. పహల్గాం బైసరన్ లోయలో ఉగ్రవాదులు కాల్పులకు పాల్పడుతున్న సమయంలో వారికి రక్షణగా కొంత దూరంలో మరికొందరు మాటు వేసి ఉన్నట్లు NIA వర్గాలు భావిస్తున్నాయి. దాటి సమయంలో సెక్యూరిటీ ఫోర్స్ కాల్పులకు దిగితే వారిని రక్షించేందుకు దూరం నుంచి కాల్పులు జరిపేందుకు సమీపంలోనే మాటు వేసి ఉన్నట్లు తెలిసింది. 

►ALSO READ | సిగ్నల్స్ లేకుండా జామర్లు పెట్టిన ఇండియా : అష్టదిగ్బంధంలో పాకిస్తాన్ ఎయిర్ స్పేస్

దాడికి పాల్పడిన దుండగులు సొంతంగా ఆహార పదార్థాలు, ఆయుధాలు తీసుకెళ్తూ ఎవరిపై ఆధారపడకుండా మెయింటైన్ చేసుకున్నారని నిఘా వర్గాల విచారణలో తేలింది. ఇతర సపోర్ట్ ఏదీ లేకుండా అడవి ప్రాంతంలోనే కొన్నాళ్లుగా ఉంటూ దాడికి ముందు రెక్కి నిర్వహించినట్లు నిఘా వర్గాలు భావిస్తున్నాయి. 

మిని స్విట్జర్లాండ్ గా భావించే బైసరన్ వ్యాలీలో.. కాల్పులు జరిపింది నలుగురు టెర్రరిస్టులుగా సోర్సెస్ భావిస్తున్నాయి. కాల్పుల సమయంలో ఇద్దరు మెయిన్ గేట్ నుంచి ఎంటరయ్యారు. ఒకరు ఎక్జిట్ వద్ద వేచి ఉన్నారు. బలగాలు కాల్పులు జరిపితే ఎటాక్ చేయడానికి బ్యాకప్ గా ఒకడు చెట్ల మధ్య ఉన్నట్లు భావిస్తున్నారు. ప్లాన్ ప్రకారం ముగ్గురు టెర్రరిస్టులు యాత్రికులపై ఫైరింగ్ మొదలుపెట్టారు. ఇందులో ఇద్దరు మిలిటరీ డ్రెస్ లో కనిపించగా.. మరొకడు సంప్రదాయ కశ్మీర్ డ్రెస్ వేసుకున్నాడు. అయితే ఎక్జిట్ గేట్ వద్ద ఉన్న ఒకడు ఫైరింగ్ స్టార్ట్ చేయడంతో అందరూ ఎంట్రెన్స్ వైపు పరిగెత్తారు. దీంతో అక్కడ ఉన్న ఉద్దరు విచక్షణా రహితంగా కాల్పులకు తెగబడ్డారని సోర్స్ వెల్లడించాయి. 

నిఘా వార్గాల చెప్పిన ఆధారాల ప్రకారం.. టెర్రరిస్టులు అల్ట్రా సోర్స్ కమ్యూనికేషన్ సిస్టం వినియోగిస్తున్నారు. సిమ్ కార్డుతో అవసరం లేకుండానే మెసేజ్ లు పంపే డివైజెస్ ను కాల్పుల సందర్భంగా వినియోగించారట. ఈ టెక్నాలజీని అంత సులువుగా పట్టుకోలేరని, టెర్రిస్టుల కమ్యూనికేషన్ ను అంత ఈజీగా ట్రాక్ చేయడం రాదని తెలుస్తోంది. ఘటనకు వారం రోజుల ముందు ఏప్రిల్ 15న రెక్కీ నిర్వహించినట్లు నిఘా వర్గాలు వెల్లడించాయి. 

ఏప్రిల్ 22న జరిగిన కాల్పుల తర్వాత ఇండియా సీరియస్ యాక్షన్ కోసం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇరు దేశాలు ఆర్మీ, నేవీ డ్రిల్స్ ప్రాక్టీస్ చేస్తున్నాయి. ఇంతటి ఉద్రిక్త పరిస్థితుల మధ్య టెర్రిస్టులు ఇంకా కశ్మీర్ లోనే ఉండటం ఒక రకంగా ఆందోళన కలిగించే అంశమే. నిఘా వర్గాల నుంచి వచ్చిన సమాచారం మేరకు ముష్కరుల కోసం వేటను మరింతగా పెంచనుంది ప్రభుత్వం.