సీఎం రేవంత్ రెడ్డితో చిత్రకారుడు రుద్ర రాజేశం భేటీ

 సీఎం రేవంత్ రెడ్డితో చిత్రకారుడు రుద్ర రాజేశం భేటీ

హైదరాబాద్: వచ్చే నెల 2న తెలంగాణ ఆవిర్భావ దశాబ్ధి ఉత్సవాల సందర్భంగా ఆవిష్కరించనున్న అధికారిక చిహ్నం సిద్ధమవుతోంది. ఇవాళ జూబ్లీ హిల్స్ లోని  సీఎం నివాసంలో చిత్రకారుడు రుద్ర రాజేశం సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. 

ఈ సందర్భంగా పలు నమూనాలను చూపించారు. వాటిని పరిశీలించిన ముఖ్యమంత్రి కొన్ని సూచనలు చేశారు. రెండు మూడు రోజుల్లో అధికారిక చిహ్నానికి తుదిరూపు వచ్చే అవకాశం ఉంది.