
లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్ 2028లో పాకిస్థాన్, న్యూజిలాండ్ జట్లు ఆడే అవకాశాలు లేనట్టు తెలుస్తోంది. ఈ రెండు జట్లు ఒలింపిక్స్ లో క్వాలిఫై కాకపోవచ్చు. టీ20 ఫార్మాట్ లో జరగనున్న 2028 ఒలింపిక్స్ లో టోర్నమెంట్ లో మొత్తం ఆరు జట్లు పాల్గొంటాయని ఒలింపిక్స్ ధృవీకరించింది. ఆఫ్ఘనిస్తాన్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, ఇంగ్లాండ్, ఇండియా, ఐర్లాండ్, న్యూజిలాండ్, పాకిస్తాన్, దక్షిణాఫ్రికా, శ్రీలంక, వెస్టిండీస్, జింబాబ్వే ఈ లిస్ట్ లో ఉన్నాయి. వీటిలో ఆరు క్వాలిఫై సాధించే ఆరు జట్ల విషయంలో ఆసక్తికరంగా మారింది.
ఈ క్రీడల కోసం ఇప్పుడు ఈ ఆరు జట్లను ఎలా సెలక్ట్ చేయాలో అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం ఆలోచితున్నట్టు సమాచారం. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ఇటీవల సింగపూర్‌లో జరిగిన వార్షిక సర్వసభ్య సమావేశం (AGM)లో ప్రాంతీయ అర్హత వ్యవస్థను ఉపయోగించాలని నిర్ణయించారు. ఈ రూల్ ప్రకారం లాస్ ఏంజిల్స్ లో జరగబోయే ఈ ప్రతిష్టాత్మక క్రీడల కోసం ఒక్కో ఖండం నుంచి ఒక్కో అత్యుత్తమ జట్టును ఎంపిక చేయాలని భావిస్తున్నారట.
అదే జరిగితే ఆస్ట్రేలియా ఖండం నుంచి ఆస్ట్రేలియా టాప్ లో ఉంటుంది. అప్పుడు ఆస్ట్రేలియా ఖండంలోనే ఉన్న న్యూజిలాండ్ ఒలింపిక్స్ కు అర్హత సాధించడంలో విఫలమవుతుంది. మరోవైపు ఆసియా ఖండం నుంచి భారత క్రికెట్ జట్టు టాప్ లో ఉంటుంది. ఆసియా ఖండం నుంచి ఇండియా అర్హత సాధిస్తే అప్పుడు పాకిస్థాన్ తో పాటు శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ జట్లు ఒలింపిక్స్ ఆడే ఛాన్స్ ఉండదు. ఈ నిర్ణయం ఇంకా ఆమోదించబడలేదు. కానీ ఇదే ఫైనల్ అయ్యే అవకాశం ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి.
►ALSO READ | IPL 2026: రూ.25 కోట్లిస్తాం.. కెప్టెన్సీ ఇస్తాం.. మా జట్టులోకి వచ్చేయ్: టీమిండియా స్టార్ ప్లేయర్‌కు కోల్‌కతా ఆఫర్
అమెరికా ఆతిధ్య జట్టుగా ఒలింపిక్స్ లో ఆడనుంది. ఓవరాల్ గా ఆరు దేశాల్లో ప్రస్తుతం ఆస్ట్రేలియా, ఇండియా, అమెరికా కన్ఫర్మ్ అయినట్టు సమాచారం. యూరోప్ ఖండం నుంచి ఇంగ్లాండ్, ఆఫ్రికా ఖండం నుంచి సౌతాఫ్రికా అర్హత సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ సైతం జట్లు అర్హత సాధించడానికి ప్రాంతీయ వ్యవస్థను ఇష్టపడుతున్నట్టు సమాచారం. మరోవైపు ఈ విధానంపై పాకిస్థాన్, న్యూజిలాండ్ జట్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి.
ఒలింపిక్స్‌లో క్రికెట్ ఇదే తొలిసారి కాదు. 1900లో పారిస్‌లో జరిగిన ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను ఆడించారు. ఇందులో ఇంగ్లండ్, ఫ్రాన్స్ రెండే టీమ్స్ బరిలోకి దిగగా.. ఇరు జట్ల మధ్య ఒకే మ్యాచ్ జరిగింది. చెరో 12 మంది క్రికెటర్లతో ఇరు జట్లు రెండ్రోజుల మ్యాచ్‌లో పోటీ పడ్డాయి. ఇంగ్లండ్ నెగ్గిన ఈ గేమ్‌ను కనీసం 20 మంది కూడా చూడలేదు. అయితే, 128 ఏండ్ల తర్వాత రీఎంట్రీ ఇస్తున్న ఈ ఆట గత దశాబ్దంలో చాలా పాపులర్ అయింది. 2028 ఒలింపిక్స్‌లో సూపర్ హిట్ అయ్యే చాన్సుంది..
🚨PAKISTAN AND NEW ZEALAND SET TO MISS OLYMPICS🚨
— Richard Kettleborough (@RichKettle07) July 30, 2025
- As Per The Guardian and ICC updates, the 2028 Olympics Cricket uses a regional format with 6 men's teams. India (Asia) and Australia (Oceania) qualify, while Pakistan & New Zealand risk exclusion.
- What's your take on this🤔 pic.twitter.com/iMZwjEfRF1