పెషావర్: నిషేధిత తెహ్రీక్- ఇ -తాలిబాన్ పాకిస్తాన్ (టీటీపీ)కు చెందిన 22 మంది టెర్రరిస్టులను పాకిస్తాన్ ఆర్మీ హతమార్చింది. మంగళవారం ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లో జరిపిన ఇంటెలిజెన్స్ ఆధారిత ఆపరేషన్‌లో ఉగ్రవాదులను ఎన్కౌంటర్ చేసినట్టు పాక్ఆర్మీ ప్రకటించింది.
మవారం నార్త్ వజీరిస్తాన్ సరిహద్దులోని బన్ను జిల్లాలో టెర్రరిస్టులు ఉన్నారనే పక్కా సమాచారం ఆధారంగా భద్రతా బలగాలు ఈ ఆపరేషన్ నిర్వహించాయని ఆర్మీ ఓ ప్రకటనలో తెలిపింది.
భద్రతా బలగాలు టెర్రరిస్టుల స్థావరాన్ని చుట్టుముట్టగానే కాల్పులు ప్రారంభించారని.. తీవ్రమైన ఎదురు కాల్పుల తర్వాత 22 మంది ఉగ్రవాదులు హతమయ్యారని పేర్కొంది.
ఆ ప్రాంతంలో ఇంకా కూంబింగ్జరుగుతోందని తెలిపింది. పాకిస్తాన్లో ఉగ్రవాద ముప్పును పూర్తిగా తుడిచిపెట్టేందుకు భద్రతా బలగాలు వేగంగా ముందుకు కదులుతున్నాయని ఐఎస్పీఆర్వెల్లడించింది.
