Asia Cup 2025: ప్రెస్ కాన్ఫరెన్స్‌లో సూర్యకు షేక్ హ్యాండ్ ఇవ్వని పాకిస్థాన్ కెప్టెన్.. అసలు నిజం ఇదే!

Asia Cup 2025: ప్రెస్ కాన్ఫరెన్స్‌లో సూర్యకు షేక్ హ్యాండ్ ఇవ్వని పాకిస్థాన్ కెప్టెన్.. అసలు నిజం ఇదే!

ఆసియా కప్ 2025లో నేడు (సెప్టెంబర్ 9) తొలి మ్యాచ్ ప్రారంభం కానుంది. అబుదాబిలోని షేక్ జాయెద్ స్టేడియంలో ఆఫ్ఘనిస్తాన్ తో హాంగ్‌కాంగ్ తలపడనుంది. మ్యాచ్ సాయంత్రం 8 గంటలకు సోనీ స్పోర్ట్స్ లో మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారమవుతుంది. ఈ మ్యాచ్ కు ముందు దుబాయ్‌లో సంప్రదాయ విలేకరుల సమావేశం జరిగింది. అబుదాబిలో నిర్వహించబడిన ఈ మీటింగ్ లో ఎనిమిది జట్ల కెప్టెన్లు హాజరయ్యారు. ప్రెస్ కాన్ఫరెన్స్ లో భాగంగా రిపోర్టర్ అడిగిన ప్రశ్నలకు అందరూ కెప్టెన్లు సమాధానమిచ్చారు. అరగంట సేపు జరిగిన ఈ మీటింగ్ లో ఆసియా కప్ టోర్నీ గురించి అన్ని జట్ల కెప్టెన్లు తమ అనుభవాలను పంచుకున్నారు.

ప్రెస్ కాన్ఫరెన్స్ ముగిసిన వెంటనే సూర్య ఆఫ్ఘనిస్తాన్ కెప్టెన్ రషీద్ ఖాన్.. బంగ్లాదేశ్ కెప్టెన్ లిటన్ దాస్.. యూఏఈ కెప్టెన్ ముహమ్మద్ వసీంలు షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటుంటే ..మరో వైపు సల్మాన్ అటుగా వెళ్ళిపోయాడు. మీటింగ్ ముగిసిన వెంటనే పాకిస్థాన్ కెప్టెన్ సల్మాన్ అలీ అఘా టీమిండియా కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ కు షేక్ హ్యాండ్ ఇవ్వకుండా వెళ్లిపోతున్నా వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. అయితే ఆ తర్వాత రిలీజ్ చేసిన వీడియోలో సూర్య, సల్మాన్ షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటూ కనిపించారు. దీంతో వీరిద్దరిపై వస్తున్న రూమర్స్ కు చెక్ పడింది.

క్రికెట్‎లో ఇండియా–పాకిస్థాన్ మ్యాచ్‎కు ఉండే క్రేజ్ వేరే. మరే మ్యాచుకు ఉండని ఆదరణ దాయాదుల పోరుకు ఉంటుంది. టెస్ట్, వన్డే, టీ20  ఫార్మాట్ ఏదైనా సరే.. ఇండియా, పాక్ జట్లు తలపడుతున్నాయంటే ఈ రెండు దేశాల క్రికెట్ ఫ్యాన్సే కాకుండా.. యావత్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ ప్రియులు ఈ మ్యాచ్ కోసం ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తుంటారు. ఇలాంటి పోరే మరికొన్ని రోజుల్లో జరగబోతుంది. సెప్టెంబర్ 14 న దుబాయ్ వేదికగా ఇండియా, పాకిస్థాన్ మధ్య ఆసియా కప్ జరగనుంది. రెండు జట్లు ఫైనల్ కు వస్తే మూడు మ్యాచ్ లు చూసే అవకాశం ఫ్యాన్స్ కు కలుగుతుంది.