పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు మూడేళ్ల జైలు శిక్ష.. అరెస్ట్ చేసిన పోలీసులు ..!

పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు మూడేళ్ల జైలు శిక్ష.. అరెస్ట్ చేసిన పోలీసులు ..!

తోషాఖానా కేసులో పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు కోర్టు మూడేళ్ల జైలు శిక్ష విధించింది. ఈ కేసులో ఇస్లామాబాద్ కోర్టు పీటీఐ చీఫ్‌ను దోషిగా నిర్ధారించింది. దీంతో ఆయనపై ఐదేళ్లపాటు అనర్హత వేటు కూడా విధించింది. అంతే కాకుండా ఇమ్రాన్ ఖాన్‌కు కోర్టు రూ. 1లక్ష జరిమానా కూడా విధించింది.

జమాన్ పార్క్‌లోని పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ నివాసానికి చేరుకున్న పోలీసులు, ఆయన నివాసంలో అరెస్టు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. కోర్టు ఇమ్రాన్ ఖాన్‌కు మూడేళ్ల జైలు శిక్ష విధించిన తర్వాత అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. అనంతరం ఇమ్రాన్ ఖాన్‌ను వెంటనే అరెస్ట్ చేయాలని ఇస్లామాబాద్ ఐజీని కోర్టు ఆదేశించింది.

పలు నివేదికల ప్రకారం, తీర్పు వెలువడిన కొద్ది నిమిషాలకే పోలీసులు ఇమ్రాన్ ఖాన్ నివాసానికి చేరుకుని అతన్ని అరెస్టు చేశారు. జమాన్ పార్క్‌కు వెళ్లే అన్ని రహదారులను బ్లాక్ చేస్తున్నట్లు నివేదికలు కూడా సూచిస్తున్నాయి.