పైలట్గా అనుభవంతో చెప్తున్నా.. పాక్ పతనానికి అడుగు దూరంలో ఉంది: మంత్రి ఉత్తమ్

పైలట్గా అనుభవంతో చెప్తున్నా.. పాక్ పతనానికి అడుగు దూరంలో ఉంది: మంత్రి ఉత్తమ్

పాక్ పతనానికి చివరి అంచులో ఉందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. భద్రతా బలగాలు లాహోర్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ను ధ్వంసం చేశాయని, పాక్ భూభాగంలోకి వెళ్లకుండానే 100 కిలోమీటర్ల దూరం నుంచే రాఫెల్ యుద్ధ విమానం లక్ష్యాలను పేల్చేసిందని తెలిపారు. రాఫెల్ ను కూల్చేశామని పాక్ అసత్య ప్రచారం చేస్తోందని అన్నారు. తనకున్న సమాచారం ప్రకారం.. పెద్ద పెద్ద గుండ్ల లాంటి సామర్థ్యం ఉన్న బాంబులతో కాల్పలు జరిపి అమాయకులపై దాడి చేసిందని అన్నారు. కానీ ఇండియా భూభాగం నుండే దాడి చేసి డైరెక్ట్ హిట్టింగ్ లో సక్సెస్ అయ్యిందని చెప్పారు. 

ఈ సందర్భంగా సైన్యంలో పనిచేసిన అనుభవాలను పంచుకున్నారు మంత్రి ఉత్తమ్. మిగ్ 21 , మిగ్ 23 ఫైటర్ జెట్ పైలెట్ గా పని చేశానని అన్నారు. శబ్దానికంటే రెండున్నర రెట్ల వేగంతో మిగ్ జెట్ లు దూసుకుపోతాయని, స్పీడ్ పెరిగే కొద్దీ వింగ్స్ వెనక్కు వెళ్తాయని తెలిపారు. రన్నింగ్ లో  స్పీడ్ పెరిగే కొద్దీ రాకెట్ షేప్ లో మిగ్ మిషన్ కనిపిస్తుందని చెప్పారు. భారత్ సైనిక సామర్థ్యంతో పోల్చితే పాక్ ఎక్కడా తూగలేదని, యుద్ధానికి ఇలాగే కాలు దువ్వితే తీవ్ర నష్టం తప్పదని అన్నారు. అవసరమైతే తాను యుద్ధంలో పాల్గొంటానని ఈ సందర్భంగా చెప్పారు.

హిందూ ముస్లింల మధ్య విభేదాలు పెంచేందుకే దాడి:

పాక్ కాల్పులు జరిపిన ప్రాంతాల్లో సుదీర్ఘ కాలం పాటు పని చేశానని అన్నారు ఉత్తమ్. ఉగ్రవాదులు చర్య అమానవియమని మండిపడ్డారు. ఇంట్లో చొరబడి దాడులు చేసిన పాక్ కు బుద్ధిచెప్పడం తప్పనిసరి చర్య అని అభిప్రాయం వ్యక్తం చేశారు. హిందూ ముస్లిం మధ్య విభేదాలు పెంచాలని ఈ దాడికి పాల్పడినట్లు తెలిపారు. పహల్గాం దాడి పాక్ ప్రేరేపిత చర్య అని చెప్పిన మంత్రి.. పాకిస్తాన్ TRF  (The Resistent Front) కు మద్ధతు పలుకుతూ ఉగ్రవాదులను పోషిస్తోందని అన్నారు. 

పాక్ ఆర్థికంగా కూలిపోయే పరిస్థితి:

పాక్ తయారు చేసుకున్న ఉగ్రవాదంతో వారే ఇబ్బంది పడుతున్నారని మంత్రి ఉత్తమ్ అన్నారు. అంతర్గత కలహాలతో అభివృద్ధి కుదేలైందని, పాక్ ఆర్థికంగా కుప్పకూలే పరిస్థితిలో ఉందని అన్నారు. పాకిస్తాన్ జమ్మూపైన అటాక్ చేసిందని,  పూంఛ్ ఉరి లో కాల్పులకు పాల్పడ్డారని చెప్పారు. గురువారం (మే 8) దాడుల్లో ఇండియన్ ఆర్మీ ముగ్గురు పాక్ పైలెట్లను కూల్చేశారని, ఒకరు ఇండియాకు చిక్కినట్లు చెప్పారు.