సాయం పేరుతో ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పైరీ అయిన ఫుడ్ ప్యాకెట్లా..?పాకిస్తాన్ వరద సాయంపై నెటిజన్ల ఫైర్

సాయం పేరుతో ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పైరీ అయిన ఫుడ్ ప్యాకెట్లా..?పాకిస్తాన్ వరద సాయంపై నెటిజన్ల ఫైర్

న్యూఢిల్లీ: శ్రీలంకలోని తుఫాను బాధితులకు పాకిస్తాన్ సర్కార్ పంపిన మానవతా సాయంపై సోషల్ మీడియాలో దుమారం రేగుతున్నది. వరద బాధితులకు పాక్ ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పైరీ డేట్ దాటిన ఫుడ్ ప్యాకెట్లు, పాలు, తాగునీరు, మెడికల్ కిట్లు పంపిందని నెటిజన్లు మండిపడుతున్నారు. 

శ్రీలంకలో వరదలతో అతలాకుతలమైన జనం కోసం పాక్ ప్రభుత్వం ఫుడ్ ప్యాకేజీలను పంపింది. ఈ విషయాన్ని కొలంబోలోని పాక్ హైకమిషనర్ కార్యాలయం ట్వీట్ చేసింది. అయితే, శ్రీలంకకు పాక్ పంపిన సరుకుల ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పైరీ డేట్ డేట్ అక్టోబర్ 2024 అని ఉండటాన్ని నెటిజన్లు గుర్తించారు.  ఇలా కాలంచెల్లిన, పాడైపోయిన వాటిని వరద బాధితులకు పంపి డప్పు కొట్టుకోవడం ఎందుకంటూ పాకిస్తాన్ అధికారులపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.