అరేబియా సముద్రంలో అనూహ్య  ఘటన.. భారత నౌకకు సాయం చేసిన పాక్ ఆర్మీ 

అరేబియా సముద్రంలో అనూహ్య  ఘటన.. భారత నౌకకు సాయం చేసిన పాక్ ఆర్మీ 

అరేబియా సముద్రంలో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. టెక్నికల్ సమస్యతో సముద్రంలో చిక్కుకున్న భారత నౌకకు పాకిస్తాన్ నౌకాదళం సాయం చేసింది.భారత్ కు చెందిన ఎంవీ  గౌతమ్ నౌక ఒమన్ నుంచి భారత్ కు తిరిగి వస్తుండగా సాంకేతిక లోపం తలెత్తింది.దీంతో నౌక సిబ్బంది పాక్ నౌకా దళానికి ఎమర్జెన్సీ సంకేతాలు పంపించారు. భారత్ అధికారుల విజ్ణప్తితో రంగంలోకి దిగిన పాకిస్తాన్ ఆర్మీ ..సహాయక చర్యలకోసం PMSS కశ్మీర్ నౌకను పంపించింది. ఎంవీ గౌతమ్ సిబ్బందికి ఆహారం, వైద్యం, అత్యవసర సాయం అందించింది. 

ప్రమాదం జరిగిన సమయంలో ఎంవీ గౌతమ్ నౌక పాకిస్తాన్ రెస్క్యూ రీజియన్ లో ఉంది. ద్వారకకు 262 నాటికల్ మైళ్ల దూరంలో నౌకను గుర్తించారు అధికారులు. ఘటన సమయంలో నౌకలో  ఆరుగురు భారతీయులు, ఒక  ఇండోనేషయన్ సహా ఏడుగురు సిబ్బంది ఉన్నారు. పరిస్థితిని సమీక్షించేందుకు అత్యవసరంగా రాజరతన్ నౌకను  భారత్ పంపించింది. ఈ  ఘటనతో భారత్ , పాక్ మధ్య  సంబంధాలపై  చర్చకు దారితీసింది.