లీటర్ పెట్రోల్ 290 రూపాయలు.. అల్లాడిపోతున్న పాకిస్తాన్

లీటర్ పెట్రోల్ 290 రూపాయలు.. అల్లాడిపోతున్న పాకిస్తాన్

పాకిస్తాన్లో పెట్రోల్ ధరలు మరోసారి భారీగా పెరిగాయి. మంగళవారం(ఆగస్టు 16, 2023)న రికార్డు స్థాయిలో పెట్రోల్, డీజిల్ ధరలు పెంచింది పాక్ తాత్కాలిక ప్రభుత్వం. ధరల పెరుగుదల పాకిస్తాన్ దివాళా స్థితికి అద్దం పడుతున్నాయి. పెరుగుతున్న నిత్యవసరాలు, కూరగాయలు, పెట్రోల్, డీజిల్ ధరలతో పాక్ ప్రజలు అల్లాడిపోతున్నారు. అంతర్జాతీయ మార్కెట్ లో ధరలు ఒక్కసారిగా పెరగడంతో లీటర్ పెట్రోల్ ధర అమాంతం 20 రూపాయలు పెంచినట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది.  కొత్తగా బుధవారం పెరిగిన  ధరలతో ప్రస్తుతం పాక్ లో లీటర్ పెట్రోల ధర రూ. 290.45 లు.  పదేహేను రోజుల్లో రెండో సారి భారీ పెంపుతో ద్రవ్యోల్బణం మరింత పెరిగే అవకాశం ఉంది.  
15 రోజుల్లోనే లీటర్ పెట్రోల్ ధర రూ.40 పెంపు పాకిస్తాన్ ఇంగ్లీష్ డైలీ ప్రకారం.. రెండు వారాల్లో పాక్ ప్రభుత్వం పెట్రోల్ ధరలను భారీగా పెంచింది. గతంలో షెహబాజ్ షరీఫ్ నేతృత్వంలో ప్రభుత్వం లీటరుకు రూ. 20 చొప్పున పెంచింది.  మరో భారీ పెంపుతో కేవలం 15 రోజుల్లోనే 40 రూపాయలు పెంచారు.  ఇప్పటికే కూరగాయలు, ఇతర నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్న ప్రజలపై ప్రభుత్వ తాజా చర్య మరింత భారం కానుంది.