న్యూఢిల్లీ: సింధ్ ప్రాంతం ఇవాళ ఇండియాలో లేకపోవచ్చు కానీ తొందర్లోనే ఆ ప్రాంతమంతా తిరిగి మన భూభాగంలో కలవచ్చని భారత రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చేసిన వ్యాఖ్యలతో పాకిస్తాన్ ఉలిక్కిపడింది. దీంతో వెంటనే రాజ్‌నాథ్ సింగ్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చింది దాయాది దేశం. ఈ మేరకు పాక్ విదేశాంగ శాఖ సోమవారం (నవంబర్ 24) ఒక ప్రకటన విడుదల చేసింది. పాకిస్తాన్ సింధ్ ప్రావిన్స్ గురించి భారత రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చేసిన వ్యాఖ్యలు ప్రమాదకరమైన రివిజనిస్ట్, హిందూత్వ విస్తరణవాద మనస్తత్వాన్ని ప్రతిబింబిస్తున్నాయని.. ఆయన వ్యాఖ్యలను పాకిస్తాన్ తీవ్రంగా ఖండిస్తోందని పేర్కొంది.
రాజ్‌నాథ్ కామెంట్స్ అంతర్జాతీయ చట్టాన్ని ఉల్లంఘించేవిగా అభివర్ణించింది. రాజ్‌నాథ్ సింగ్‌తో పాటు ఇతర భారత నాయకులు ప్రాంతీయ శాంతి, స్థిరత్వానికి ముప్పు కలిగించే రెచ్చగొట్టే వ్యాఖ్యలు మానుకోవాలని పాక్ నీతులు వల్లించింది.భారత ప్రభుత్వం సొంత దేశ పౌరుల భద్రత.. ముఖ్యంగా బలహీన మైనారిటీ వర్గాల భద్రతను నిర్ధారించడంపై దృష్టి పెట్టాలని ఉచిత సలహా ఇచ్చింది.
రాజ్‌నాథ్ సింగ్ ఏమన్నారంటే..?
‘‘సింధ్ ప్రాంతం ఇవ్వాల మన దేశంతో కలిసి లేకపోవచ్చు.. కానీ తొందర్లోనే ఆ ప్రాంతమంతా తిరిగి మన భూభాగంలో కలవచ్చు. భౌగోళికంగా విడిపోయినా నాగరికత పరంగా చూసుకుంటే సింధ్ఎల్లప్పుడూ భారత్‌తోనే ఉంది. భూభాగానికి సంబంధించిన ఆందోళనలు కొనసాగుతున్న చోట సరిహద్దుల్లో మార్పులు తప్పకుండా చోటుచేసుకుంటాయి” అని కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు.
ఈ మేరకు ఆదివారం (నవంబర్ 24) ఢిల్లీలో జరిగిన సింధి సమాజ్ సమ్మేళన్‌లో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. దేశ విభజన సమయంలో సింధ్ప్రావిన్స్ పాకిస్తాన్ పరం కావడంతో అక్కడి హిందువులు చాలామంది భారత్‌కు వచ్చేశారు. సింధూ నది పరీవాహక ప్రాంతంలోని ఈ ప్రావిన్స్ నాగరికతపరంగా భారత్‌తో కలిసే ఉంది.
ఈ విషయాన్ని కేంద్ర మంత్రి రాజ్ నాథ్ ప్రస్తావిస్తూ.. ఎల్ కే అడ్వాణి తరం నేతలు సింధ్ప్రావిన్స్ భారత్‌లో భాగం కాదనే విషయాన్ని ఎన్నడూ అంగీకరించలేదని గుర్తుచేశారు. సింధూ నదిని అక్కడి ప్రజలు మాత్రమే కాదు, మొత్తం భారతీయులంతా పవిత్రంగా భావిస్తారని, దైవంగా కొలుస్తారని రాజ్ నాథ్ చెప్పారు. ఈ క్రమంలోనే సింధూ భారత్‌లో భాగంగా కావొచ్చని రాజ్ నాథ్ సింగ్ చేసిన వ్యాఖ్యలపై పాక్ అభ్యంతరం వ్యక్తం చేసింది.
