అబ్రహం ఒప్పందాల్లో చేరే ప్రసక్తే లేదు: అమెరికా ప్రతిపాదనను తిరస్కరించిన పాకిస్తాన్

అబ్రహం ఒప్పందాల్లో చేరే ప్రసక్తే లేదు: అమెరికా ప్రతిపాదనను తిరస్కరించిన పాకిస్తాన్

ఇస్లామాబాద్: ఇజ్రాయెల్‌‌‌‌‌‌‌‌తో దౌత్య సంబంధాలను మెరుగుపరుచుకునేందుకు ఉద్దేశించిన ‘అబ్రహం ఒప్పందాల్లో’ చేరాలని అమెరికా చేసిన ప్రతిపాదనను పాకిస్తాన్ తిరస్కరించింది. ఈ అంతర్జాతీయ కూటమిలో భాగస్వామి కావాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన విజ్ఞప్తిని తాము అంగీకరించే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది.

ఇరాన్‌‌‌‌‌‌‌‌తో ప్రస్తుతం తాము జరుపుతున్న దౌత్యపరమైన చర్చలకు, అబ్రహం ఒప్పందాలకు ఎలాంటి సంబంధం లేదని వెల్లడించింది. ఇవి రెండు వేర్వేరు అంశాలని, ఒకదానితో ఒకటి ముడిపెట్టడం సాధ్యం కాదని వివరించింది.

అమెరికా వంటి అగ్రరాజ్యం నుంచి ఒత్తిళ్లు వచ్చినప్పటికీ, ఇలాంటి ఏకపక్ష డిమాండ్లకు కట్టుబడాల్సిన నిబంధనేది తమ దేశంపై లేదని పాక్ తేల్చి చెప్పింది. అమెరికా ప్రతిపాదనను కేవలం పాకిస్తాన్ మాత్రమే కాకుండా.. ముస్లిం ప్రపంచంలో అత్యంత కీలకమైన సౌదీ అరేబియా కూడా పూర్తిగా తోసిపుచ్చింది.