పాక్‌ సెనేట్‌ సెషన్‌ చైర్‌ పర్సన్ గా కృష్ణ కుమారి

పాక్‌ సెనేట్‌ సెషన్‌ చైర్‌ పర్సన్ గా కృష్ణ కుమారి

వెలుగు‌: పాకిస్థాన్‌ పార్లమెంట్‌లో మొదటి దళిత హిందూ మహిళా సెనేటర్‌ గా రికార్డు సృష్టించి న కృష్ణ కుమారి కొహ్లికి మరో అరుదైన గౌరవం దక్కిం ది. శుక్రవారం అంతర్జా తీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆమెను ఒకరోజు పార్లమెంట్‌ హౌస్ కు ఛైర్‌ పర్సన్ గా నియమించారు. సెనెట్‌ సెషన్‌ నిర్వహించిన మహిళగా ఆమెకు అరుదైన గౌరవం దక్కింది. మహిళా దినోత్సవం సందర్భంగా ఆమెను ఒక్కరోజు ఛైర్‌ పర్సన్ గా నియమిస్తూ ఛైర్మన్‌ కిశోభాయ్‌ నిర్ణయం తీసుకున్నారని సెనేటర్‌ ఫైజల్‌ జావిద్‌ చెప్పారు . ఈ సందర్భంగా కృష్ణ కుమారి మాట్లాడుతూ తనకు ఈ గౌరవం దక్కటం చాలా అదృష్టం గా భావిస్తున్నానని అన్నారు.