వరల్డ్ కప్ : సౌతాఫ్రికాకు పాకిస్థాన్ టార్గెట్ 309

వరల్డ్ కప్ : సౌతాఫ్రికాకు పాకిస్థాన్ టార్గెట్ 309

లండన్ : లార్డ్స్ స్టేడియంలో సౌతాఫ్రికాతో జరుగుతున్న వరల్డ్ కప్ లీగ్ మ్యాచ్ లో పాకిస్థాన్ జట్టు బ్యాట్స్ మెన్ రాణించారు. సఫారీ జట్టుకు 50 ఓవర్లలో 309 పరుగుల టార్గెట్ ను పెట్టారు. టాస్ గెలిచిన పాకిస్థాన్ మొదట బ్యాటింగ్ తీసుకుంది. ఓపెనర్లు ఇమాముల్ హక్, ఫఖర్ జమాన్ పాకిస్థాన్ కు మంచి ఆరంభం ఇచ్చారు. తొలి వికెట్ కు 81 రన్స్ జోడించారు. ఆ తర్వాత టాప్, మిడిలార్డర్ బ్యాట్స్ మెన్ అందరూ రాణించారు. హారిస్ సోహైల్ 3 సిక్సులు, 9 ఫోర్లతో 59 బాల్స్ లో 89 రన్స్ చేసి పాకిస్థాన్ లో టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఇమాముల్ 44, జమాన్ 44, బాబర్ అజమ్ 69, హఫీజ్ 20, ఇమాద్ వాసిమ్ 23 రన్స్ చేశారు.  సౌతాఫ్రికా ముందు పాకిస్థాన్ భారీ లక్ష్యాన్ని ఉంచింది.

సఫారీ బౌలర్లలో ఎన్ గిడి 3, తాహిర్ 2, ఫెలుక్వాయో, మార్ క్రమ్ చెరో వికెట్ పడగొట్టారు.