కాబూల్: ఆప్ఘానిస్తాన్పై వైమానిక దాడులతో పాకిస్తాన్ మరోసారి విరుచుకుపడింది. సోమవారం (నవంబర్ 24) రాత్రి పాకిస్తాన్ దళాలు జరిపిన ఎయిర్ స్ట్రైక్‌లో 10 మంది సామాన్య పౌరులు మృతి చెందినట్లు తాలిబన్ ప్రభుత్వం వెల్లడించింది. ఖోస్ట్‌లోని గుర్బుజ్ జిల్లా మొఘల్‌గై ప్రాంతంలో సోమవారం రాత్రి పాకిస్తాన్ దళాలు వైమానిక దాడులు జరిపాయని ఆఫ్ఘన్ తాలిబన్ ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ వెల్లడించారు. ఈ దాడుల్లో కనీసం తొమ్మిది మంది పిల్లలు, ఒక మహిళ మరణించారని తెలిపారు. కునార్, పాక్టికా ప్రావిన్సులలో కూడా పాకిస్తాన్ దాడులు నిర్వహించిందని, నలుగురు పౌరులు గాయపడ్డారని చెప్పారు.
పాకిస్తాన్-ఆఫ్ఘనిస్తాన్ ఉద్రిక్తత
ఇరుదేశాల మధ్య సరిహద్దు వివాదంతో గత కొన్ని నెలలుగా పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. 2025, అక్టోబర్‌లో ఆఫ్ఘన్ సరిహద్దు ప్రాంతాలలో పాకిస్తాన్ వైమానిక దాడులు నిర్వహించింది. పాక్ దాడిలో ముగ్గురు ఆఫ్ఘన్ క్రికెటర్లను మరణించారు. వీరితో పాటు పిల్లలు సహా పౌరులు కూడా ఉన్నారని ఆఫ్ఘన్ అధికారులు ఆరోపించారు.
ఈ దాడికి ప్రతీకారంగా ఆప్ఘాన్ కూడా పాకిస్తాన్‌పై దాడులు చేసింది. ఇరుదేశాల మధ్య తలెత్తిన ఘర్షణలు యుద్ధానికి దారి తీశాయి. ఈ క్రమంలో అమెరికా జోక్యం చేసుకుని ఇరుదేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిర్చింది. సీజ్ ఫైర్ ఉల్లంఘించి పాక్ వైమానికి దాడులు చేయడంతో ఇరుదేశాల మధ్య మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
