
- పోలీసులకు వీహెచ్పీ... బజరంగ్దళ్ నాయకుల ఫిర్యాదు
శంషాబాద్, వెలుగు: శంషాబాద్ లో ముస్లింలు ఆదివారం నిర్వహించిన మిలాద్ ఉన్నబీ ర్యాలీలో ఓ యువకుడు పాలస్తీనా జెండా ప్రదర్శించాడు. దీంతో అక్కడే బందోబస్తులో ఉన్న ఆర్జీఐఏ పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై వీహెచ్పీ, బజరంగ్దళ్నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలస్తీనా జెండాను ప్రదర్శించిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్చేశారు.
ఈ మేరకు సోమవారం సీఐ బాలరాజుకు ఫిర్యాదు చేశారు. శంషాబాద్ లో అన్ని మతాల ప్రజలు పండుగలను ఒకరికొకరు సహకరించుకుంటూ జరుపుకుంటున్నారని తెలిపారు. ఇలాంటి ఘటనల వల్ల ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని పేర్కొన్నారు. ముస్లిం పెద్దలతో సమావేశం ఏర్పాటు చేసి, మరోసారి ఇలా జరగకుండా చూడాలని విన్నవించారు.