
చేవెళ్ల, వెలుగు : చేవెళ్ల సెగ్మెంట్ కాంగ్రెస్ అభ్యర్థి పామెన భీం భరత్ బర్త్ డే వేడుకలు గురువారం ఘనంగా జరిగాయి. చేవెళ్ల సెగ్మెంట్లోని షాబాద్, శంకర్పల్లి, చేవెళ్ల, మొయినాబాద్, నవాబ్ పేట మండలాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు ఆయన ఇంటికి భారీగా తరలివచ్చి విషెస్ తెలిపారు. చేవెళ్ల గ్రామ సర్పంచ్ బండారి శైలజ, పీఏసీఎస్ చైర్మన్లు దేవర వెంకటరెడ్డి, ప్రతాప్ రెడ్డి, మాజీ ఉప సర్పంచ్ టేకులపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు.
కాంగ్రెస్లో చేరిన బీఆర్ఎస్ నేతలు
చేవెళ్ల మండల పరిధిలోని ఖానాపూర్కు చెందిన బీఆర్ఎస్ నేతలు గురువారం పామెన భీం భరత్ సమక్షంలో కాంగ్రెస్లో చేరారు. సుమారు 90 మంది బీఆర్ఎస్ కార్యకర్తలు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా పామెన భీం భరత్ మాట్లాడుతూ.. తెలంగాణ అభివృద్ధి రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్తోనే సాధ్యమవుతుందన్నారు. కాంగ్రెస్ ప్రకటించిన 6 గ్యారంటీలపై నమ్మకంతో పార్టీలో చేరుతున్నారన్నారు.