నిర్మల్ జిల్లాలో నాటు బాంబుల కలకలం.. గేదెలు బాంబులు నమలటంతో ప్రమాదం

నిర్మల్ జిల్లాలో నాటు బాంబుల కలకలం.. గేదెలు బాంబులు నమలటంతో ప్రమాదం

నిర్మల్ జిల్లా దస్తురాబాద్ మండలం దేవునిగూడెం గ్రామ సమీపంలో నాటుబాంబులు కలకలం సృష్టించాయి. పొలాలకు సమీపంలో అమర్చిన బాంబులను గేదెలు నమలటంతో ప్రమాదం జరిగింది.  2025 మే 2వ తేదీన జరిగిన ఈ ఘటన సమీప గ్రామాలలో కలకలం రేపింది.

దేవునిగూడెం శివారు అటవి సమీపంలో వన్యప్రాణుల వేటకోసం నాటుబాంబులు అమర్చారు స్మగ్లర్లు.  మేత కోసం అటుగా వెళ్లిన గేదెలు నాటుబాంబులు కొరకడంతో తీవ్ర గాయాల పాలయ్యాయి. 
దీంతో స్థానికులు పోలీసులకు, అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు. 

గత కొద్ది రోజులుగా నాటు బాంబులతో అడవీ పందులను, జింకలను ఇతర వన్యప్రాణులను వేటాడుతున్నారు స్మగ్లర్లు. ఇప్పటికే పోలీసులు హెచ్చరించినా మళ్లీ వన్యప్రాణుల వేట కొనసాగిస్తున్నారు. స్మాగ్లర్లపై కఠిన చర్యలు తీసుకోవాలిని స్థానికులు కోరుతున్నారు.