హారర్ ఎలిమెంట్స్‌‌‌‌తో పంజరం

హారర్ ఎలిమెంట్స్‌‌‌‌తో పంజరం

అనిల్, యువతేజ, ముస్కాన్, రూప  లీడ్ రోల్స్‌‌‌‌లో  నటించిన చిత్రం ‘పంజరం’. సాయి కృష్ణ దర్శకత్వంలో ఆర్ రఘన్ రెడ్డి నిర్మిస్తున్నారు.  తాజాగా ఈ మూవీ ట్రైలర్‌‌‌‌‌‌‌‌ను రిలీజ్ చేశారు. హారర్ ఎలిమెంట్స్‌‌‌‌తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్టు ట్రైలర్ ద్వారా రివీల్ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఈవెంట్‌‌‌‌లో   దర్శకుడు సాయికృష్ణ మాట్లాడుతూ ‘ఈ సినిమాకు మోహన్ మ్యూజిక్ ప్లస్ అవుతుంది.  

ఈ చిత్రానికి పని చేసిన ప్రతీ ఒక్కరూ పెద్ద స్టార్స్ అవుతారు’ అని చెప్పాడు. మల్లి పాత్రలో యువతేజ, కార్తీక్‌‌‌‌గా అనిల్, వెన్నెల క్యారెక్టర్‌‌‌‌‌‌‌‌లో హీరోయిన్ రూప కనిపించనున్నట్టు చెప్పారు. నటులు పద్మ, రమణ, ప్రదీప్, మ్యూజిక్ డైరెక్టర్ నాని మోహన్ సహా టీమ్ అంతా పాల్గొన్నారు.