పాపికొండల టూర్కు తాత్కాలికంగా బ్రేక్

పాపికొండల టూర్కు తాత్కాలికంగా బ్రేక్

 భద్రాచలం, వెలుగు : భారీ వర్షాల కారణంగా గోదావరిలో పాపికొండల టూర్​కు తాత్కాలికంగా బ్రేక్​ పడింది. వర్షాలతో వాగులు, వంకలు పొంగడంతో పాటు గోదావరిలోకి వరద నీరు వచ్చి చేరుతోంది. సీలేరు, శబరి నదుల నుంచి కూనవరం వద్ద గోదావరిలోకి నీళ్లు వస్తున్నాయి.

ఈ నేపథ్యంలో టూరిస్టుల భద్రతను దృష్టిలో ఉంచుకుని పాపికొండల టూర్​ను నిలిపివేశారు. భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో భారీ వర్షాల నేపథ్యంలో కలెక్టర్​ జితేశ్​ వి పాటిల్​ అప్రమత్తంతా ఉండాలని సూచించారు. కలెక్టరేట్, భద్రాచలం ఆర్డీవో ఆఫీస్ లో కంట్రోల్​ రూమ్​లను ఏర్పాటు చేశారు. వాగులు దాటొద్దని, నదుల వద్ద సెల్ఫీలు దిగొద్దని సూచించారు. ‌‌‌‌