V6 News

కరీంనగర్‌‌‌‌‌‌‌‌ పారమిత విద్యార్థుల ప్రతిభ

కరీంనగర్‌‌‌‌‌‌‌‌ పారమిత విద్యార్థుల ప్రతిభ

కొత్తపల్లి, వెలుగు : పదోతరగతి ఫలితాల్లో పారమిత విద్యార్థుల ప్రతిభ చాటినట్లు స్కూల్​చైర్మన్​ ఇనుగంటి ప్రసాదరావు తెలిపారు. రాచమల్ల ఆద్య 583,  రామక కార్తికేయ 583,  గట్టు సంప్రీతి 582 మార్కులు సాధించగా.. 84 మంది విద్యార్థులు 90% పైగా, 173 మంది విద్యార్థులు 80% పైగా, 198 మంది విద్యార్థులు 70% పైగా, 99 శాతం విద్యార్థులు 60% పైగా సాధించినట్లు పేర్కొన్నారు.

మ్యాథ్స్​, సోషల్​, తెలుగులో 100 మార్కులు, ఇంగ్లిష్​, సైన్స్​లో 99, హిందీలో 98 మార్కులు సాధించినట్లు వివరించారు. అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను చైర్మన్ ప్రసాదరావు అభినందించారు. కార్యక్రమంలో డైరెక్టర్లు ప్రసూన, అనుకర్ రావు, రస్మిత, వినోదరావు, రాకేశ్, వీయూఎం ప్రసాద్, హన్మంతరావు, హెచ్​ఎంలు ప్రశాంత్, బాలాజీ,  కవిత  సమన్వయకర్త శ్రీనాథ్, టీచర్స్​ పాల్గొన్నారు.