కాంగ్రెస్ పార్టీలో ఎవరిని బలవంతంగా చేర్చుకోలేదు - పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్​రెడ్డి

కాంగ్రెస్ పార్టీలో ఎవరిని బలవంతంగా చేర్చుకోలేదు - పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్​రెడ్డి

హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ అధికారంలోకి రావడాన్ని ఓర్వలేకనే బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు విమర్శలు చేస్తున్నాయని పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ పార్టీలో ఎవరిని బలవంతంగా చేర్చుకోలేదని తెలిపారు. శనివారం గాంధీ భవన్​లో ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ మైనారిటీ వ్యతిరేక చట్టాలను తీసుకువస్తే దానికి మద్దతు పలికింది బీఆర్​ఎస్ కాదా అని ప్రశ్నించారు. రైతుల కోసం బీజేపీకి వ్యతిరేకంగా రాహుల్ పోరాటం చేశారని గుర్తుచేశారు. తమ పార్టీలోకి ఎవరైనా వస్తున్నారంటే వారిని రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఆయా పార్టీలదేనన్నారు. రాష్ట్రంలో గతంలో ఉద్యోగులకు జీతాలు చెల్లించలేని పరిస్థితులు ఉండేవని, కాంగ్రెస్ సర్కారు వచ్చాక ఒకటో తేదీనే జీతాలు ఇస్తున్నామని వెల్లడించారు. కాంగ్రెస్​ది అవినీతికి తావులేని ప్రభుత్వమని స్పష్టం చేశారు. తెలంగాణ కోసం పదవికి రాజీనామా చేసిన వ్యక్తి కోమటి రెడ్డి అని ఆయనను ఏక్​నాథ్‌ షిండేతో పోల్చడం సిగ్గుచేటని మండిపడ్డారు.