మంత్రి దళితుల భూముల్ని లాక్కుంటున్నారు: పారిజాత నర్సింహరెడ్డి

మంత్రి దళితుల భూముల్ని లాక్కుంటున్నారు:  పారిజాత నర్సింహరెడ్డి

మంత్రి సబితా ఇంద్రా రెడ్డి బడంగ్​పేట మున్సిపాలిటీ పరిధిలోని దళితుల భూములను లాక్కుంటున్నారని కార్పొరేషన్​ మేయర్​ పారిజాత నర్సింహరెడ్డి ఆరోపించారు. దావుద్ ఖాన్ గూడా లో వారం రోజులుగా చేపట్టిన  భూ నిర్వాసితుల దీక్ష కు  కాంగ్రెస్​ నేతలు ఆగస్టు 5న మద్దతు తెలిపారు. 

ఈ సందర్భంగా మేయర్​ మాట్లాడుతూ.. సర్వే నంబర్​2 లో 40 ఎకరాల భూమిని 1955 నుంచి సాగు చేస్తున్న రైతుల నుంచి లాక్కునేందుకు సబిత ప్రయత్నిస్తున్నారన్నారు. భూ కబ్జాదారులను ప్రోత్సహిస్తున్న ఆమెను వెంటనే బర్తరఫ్​ చేయాలని ఆమె డిమాండ్​ చేశారు. 

వారం రోజులుగా భూ నిర్వాసితులు చేస్తున్న దీక్షకు కాంగ్రెస్ నేతలు మద్దతు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో పేదలకు పట్టాలు పంచి పెట్టామని... కానీ బీఆర్​ఎస్​ ప్రభుత్వం  భూ నిర్వాసితులకు పట్టాలివ్వకుండా కబ్జాదారులను ప్రోత్సహిస్తోందని ఆరోపించారు.  బడంగ్ పేటలో ఎంతమంది నిర్వాసితులు ఉన్నారో లెక్క తీసి వారికి స్థలాలు కేటాయించాలని అన్నారు.  దళితులకు కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని వారికి తగిన న్యాయం చేసేవరకు పోరాటం చేస్తామని అన్నారు. డీసీసీ అధ్యక్షుడు చల్లా నర్సింహ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.