డిసెంబర్ 1 నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు

డిసెంబర్ 1 నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు

పార్లమెంట్ శీతాకాల సమావేశాలకు ముహూర్తం ఫిక్స్ అయ్యింది. డిసెంబర్ 1 నుంచి 19 వరకు పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరగనున్నట్లు వెల్లడించారు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు. ఈ సమావేశాల్లో అన్ని అంశాలపై చర్చకు కేంద్రం సిద్ధంగా ఉందని అన్నారు కిరణ్ రిజిజు. ఈమేరకు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు. శీతాకాల సమావేశాలు సజావుగా సాగేలా విపక్షాలు సహకరించాలని ట్వీట్ ద్వారా కోరారు. 

ఈ సమావేశాల్లో అమెరికా సుంకాలతో పాటు పలు కీలక అంశాలపై చర్చ జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. డిసెంబర్ 1న ప్రారంభం కానున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాలు 19వ తేదీ వరకు జరగనున్నాయి. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనను రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆమోదించారని తెలిపారు మంత్రి. పార్లమెంటరీ వ్యవహారాలకు అనుగుణంగా.. శీతాకాల సమావేశాల షెడ్యూల్ నిర్ణయించినట్లు తెలిపారు కిరణ్ రిజిజు.