కజిరంగా నేషనల్​ పార్క్​లోకి వరద

కజిరంగా నేషనల్​ పార్క్​లోకి వరద

గువాహటి: అసోంలో గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు వరదలు పోటెత్తుతున్నాయి. సుమారు లక్షమంది ప్రజలు వరదనీటిలో చిక్కుకుపోయారు. మరోవైపు వరదనీరు కజిరంగా నేషనల్ పార్కు (కేఎన్​పీ)లోకి ప్రవేశించింది. ప్రపంచ వారసత్వ సైట్​గా యునెస్కో గుర్తింపు పొందిన కజిరంగా పార్కు ఒంటికొమ్ము ఖడ్గమృగాలకు ప్రసిద్ధి చెందింది.  గత రెండురోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కజిరంగా జాతీయ పార్కులోని 68 ఫారెస్ట్​క్యాంపులు నీటమునిగాయి. కేఎన్​పీలోకి ప్రవేశించిన వరదనీటి వల్ల ఇంతవరకూ జంతువులు చనిపోలేదని, రెండు జింకలను రక్షించి చికిత్స కోసం పునరావాస కేంద్రానికి తరలించినట్లు ఫారెస్టు అధికారి తెలిపారు. కాగా,  వరదనీటిలో మొత్తం 98,840మంది చిక్కుకున్నారని అసోం రాష్ర్ట డిజాస్టర్​ మేనేజ్​మెంట్​ అథార్టీ (ఏఎస్డీఎంఏ) సోమవారం వెల్లడించింది. 13జిల్లాల్లోని 371గ్రామాలపై వరద ప్రభావం పడిందని ఏఎస్డీఎంఏ ప్రకటించింది. అయితే వరదల కారణంగా కొత్తగా ఎటువంటి మరణాలు నమోదు కాలేదని నివేదికలో అధికారులు పేర్కొన్నారు.  అసోంలోని పలుప్రాంతాల్లో బ్రహ్మపుత్ర, దిఖౌ నదులు ప్రమాదకరస్థాయిని మించి ప్రవహిస్తున్నాయి. దిఖౌ నది శివసాగర్ వద్ద, బ్రహ్మపుత్ర నది దుబ్రీ, తేజ్​పూర్​, నేమాటీఘాట్​ప్రాంతాల్లో ప్రమాదకరస్థాయిని మించి ప్రవహిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.

ALSO READ:సింగపూర్​లో ఎంపీలుగా మనోళ్లు ముగ్గురు