- 2 లక్షల వాహనాలను
- ఎక్స్‌పోర్ట్ చేసిన మారుతి
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో ఇండియా నుంచి ప్యాసింజర్ వాహనాల ఎగుమతులు 18 శాతం పెరిగాయి. సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫాక్చరర్స్ (సియామ్) డేటా ప్రకారం, ఈ ఏడాది ఏప్రిల్–సెప్టెంబర్ మధ్య కాలంలో మొత్తం 4,45,884 వాహనాలు విదేశాలకు ఎగుమతి అయ్యాయి. గత సంవత్సరం ఇదే కాలంలో ఈ నెంబర్ 3,76,679 యూనిట్లుగా నమోదైంది.
మారుతి సుజుకీ ఎగుమతులు పెరగడంతో ఈ వృద్ధి సాధ్యమైంది. ఈ ఒక్క కంపెనీనే ఆరు నెలల్లో 2 లక్షలకుపైగా వాహనాలను ఎక్స్‌పోర్ట్ చేసింది. కార్లు, యుటిలిటీ వాహనాలు, వ్యాన్‌ల విభాగాల్లో వృద్ధి కనిపించింది. మారుతి 40 శాతం వృద్ధితో 2,05,763 యూనిట్లను ఎగుమతి చేయగా, హ్యుందాయ్ 99,540 యూనిట్లు, నిస్సాన్ 37,605 యూనిట్లు, ఫోక్స్‌వ్యాగన్ 28,011 యూనిట్లు, టయోటా 18,880 యూనిట్లు, కియా 13,666 యూనిట్లు, హోండా 13,243 యూనిట్లను ఎగుమతి చేశాయి. మిడిల్ ఈస్ట్, లాటిన్ అమెరికా మార్కెట్లలో మంచి డిమాండ్ కనిపించింది. అమెరికాకు ఎగుమతులు సెప్టెంబర్‌లో టారిఫ్‌ల వల్ల తగ్గినా, కొరియా, యూఏఈ, జర్మనీ, మెక్సికో, బ్రెజిల్, కెన్యాతో సహా 24 దేశాలకు పెరిగాయి.
