పతంజలి ఫుడ్స్ కు హైకోర్టు లో చుక్కెదురు...సూర్యాపేట లో ఫ్యాక్ట రీ జోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రద్దుపై స్టేకు నో

పతంజలి ఫుడ్స్ కు హైకోర్టు లో చుక్కెదురు...సూర్యాపేట లో ఫ్యాక్ట రీ జోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రద్దుపై స్టేకు నో

హైదరాబాద్, వెలుగు: సూర్యాపేటలో ఫ్యాక్టరీ జోన్‌‌‌‌‌‌‌‌ రద్దుకు సంబంధించి పతంజలి ఫుడ్స్‌‌‌‌‌‌‌‌ లిమిటెడ్‌‌‌‌‌‌‌‌కు హైకోర్టులో చుక్కెదురైంది. పతంజలి ఫుడ్స్‌‌‌‌‌‌‌‌ లిమిటెడ్‌‌‌‌‌‌‌‌కు సూర్యాపేటలో కేటాయించిన ఫ్యాక్టరీ జోన్‌‌‌‌‌‌‌‌ను రద్దును సమర్థిస్తూ సింగిల్‌‌‌‌‌‌‌‌ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులపై స్టేకు హైకోర్టు నిరాకరించింది. పామాయిల్‌‌‌‌‌‌‌‌ ఉత్పత్తి పెంపులో భాగంగా ఫ్యాక్టరీ జోన్‌‌‌‌‌‌‌‌ను రద్దు చేస్తూ ప్రభుత్వం గతేడాది ఉత్తర్వులు జారీ చేసింది. దీన్ని సవాల్ చేస్తూ పతంజలి ఫుడ్స్‌‌‌‌‌‌‌‌ హైకోర్టును ఆశ్రయించగా.. ప్రభుత్వ ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోవడానికి సింగిల్‌‌‌‌‌‌‌‌ జడ్జి నిరాకరించారు. 

ఆ ఉత్తర్వులను సవాలు చేస్తూ పతంజలి ఫుడ్స్‌‌‌‌‌‌‌‌ హైకోర్టులో అప్పీలు దాఖలు చేసింది. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌‌‌‌‌‌‌‌ అపరేశ్‌‌‌‌‌‌‌‌ కుమార్‌‌‌‌‌‌‌‌ సింగ్, జస్టిస్‌‌‌‌‌‌‌‌ జి.ఎం.మొహియుద్దీన్‌‌‌‌‌‌‌‌లతో కూడిన ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది. ఇరుపక్షాల వాదనలను విన్న ధర్మాసనం.. సింగిల్‌‌‌‌‌‌‌‌ జడ్జి ఉత్తర్వులపై స్టే ఇవ్వడానికి ప్రాథమిక ఆధారాలు లేవంటూ నిరాకరించింది.