
సంతోషం వ్యక్తం చేసిన ఇన్నోవేటర్ గడ్డం వంశీకృష్ణ
హైదరాబాద్, వెలుగు: దేశంలోనే తొలి సోలార్‌రూఫ్‘ఆటమ్’ను కనిపెట్టిన విశాక జేఎండీ గడ్డం వంశీకృష్ణకు ఆ ఇన్నోవేషన్‌పై పేటెంట్ హక్కులు దక్కాయి. 2017 మార్చి 31 నుంచి 20 ఏండ్లపాటు ఈ రైట్స్ ఉంటాయని కేంద్రం మంగళవారం ప్రకటించింది. పేటెంట్ హక్కులు రావడంపై వంశీకృష్ణ సంతోషం వ్యక్తం చేశారు. ప్రపంచంలోనే తొలి సోలార్‌రూఫ్ అయిన ‘ఆటమ్’ టెక్నాలజీపై 2016 నుంచి పని చేస్తున్నామని చెప్పారు. ప్రస్తుత కాలంలో తిండి, బట్ట, ఇంటితో పాటు కరెంటు కూడా ముఖ్యమని.. అలాంటి కరెంటును ఇంటి రూఫ్‌నుంచి ఉత్పత్తిచేయడంపై దృష్టి పెట్టి ఆటమ్‌ను డిజైన్ చేశామని అన్నారు. సాధారణ సోలార్ ప్యానళ్లతో పోలిస్తే 22 నుంచి 40 శాతంవరకు ఎక్కువ కరెంటును ఆటమ్ ఉత్పతి చేస్తుందని, పైగా ఆటమ్ రూఫ్ చూడటానికి అందంగా కూడా ఉంటుందని చెప్పారు. ఈ ప్రొడక్ట్‌ను ప్రపంచ ప్రసిద్ధిగాంచిన లెబొరేటరీ యూఎల్2019లోనే సర్టిఫై చేసింది. మంటలు, పెద్ద పెద్ద గాలులను కూడా ఆటమ్ తట్టుకోగలదు. రూప్‌పై పెట్టిన పెట్టుబడి నాలుగేళ్లలోనే తిరిగి వస్తుంది. ఇంటిపైన రూఫ్ స్పేస్ వేస్ట్ కాకుండా అడిషనల్ స్పేస్‌ను ఆటమ్ ఇస్తుంది. కరోనా తర్వాత హాస్పిటళ్లు, ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్లు ఈ అడిషన్ స్పేస్ కోసం ఆటమ్‌ను ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నాయి.
For More News..