కేజీఎఫ్ -2 రికార్డును బ్రేక్ చేసిన ప‌ఠాన్‌

కేజీఎఫ్ -2 రికార్డును బ్రేక్ చేసిన ప‌ఠాన్‌

బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ నటించిన పఠాన్ రోజుకో రికార్డు సృష్టిస్తోంది. తాజాగా కేజీఎఫ్-2 రికార్డ్స్ ను సైతం బ్రేక్ చేస్తూ.. సంచలనం సృష్టించింది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా హయ్యెస్ట్ నెట్ కలెక్షన్స్ వసూలు చేసిన పఠాన్.. ప‌దిహేను రోజుల్లో వ‌ర‌ల్డ్ వైడ్‌గా రూ. 900 కోట్లకుపైగా క‌లెక్షన్స్ రాబ‌ట్టింది. ఇండియాలో రూ.450కోట్ల కలెక్షన్స్ సొంతం చేసుకుంది. దేశ వ్యాప్తంగా అత్యంత ఎక్కువ వసూళ్లు రాబ‌ట్టిన హిందీ సినిమాల్లో సెకండ్ ప్లేస్‌కు ప‌ఠాన్ చేరుకుంది.

గ‌తంలో ఈ రికార్డ్ య‌శ్ కేజీఎఫ్ -2 సినిమా పేరు మీద ఉండగా.. తాజాగా అది షారుఖ్ పేరు మీదకు మళ్లింది. అప్పట్లో కేజీఎఫ్ 2 హిందీ వెర్షన్ ఇండియా వైడ్ గా రూ.434 కోట్ల క‌లెక్షన్స్ ద‌క్కించుకుంది. ఆ రికార్డ్‌ను ప‌ఠాన్ ప‌దిహేను రోజుల్లోనే బ్రేక్ చేసి సత్తా చూపింది. దర్శక ధీరుడు రూపొందించిన బిగ్గెస్ట్ ఫిల్మ్ బాహుబలి రూ.510కోట్లతో ఫస్ట్ ఉండగా.. మరి కొన్ని రోజుల్లో ఆ రికార్డును కూడా పఠాన్ బ్రేక్ చేయనుందని సినీ అభిమానులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.