సెల్ఫీ వీడియో: పాజిటివ్ వచ్చినా.. ప్రభుత్వ లెక్కల్లో నెగెటివ్

సెల్ఫీ వీడియో: పాజిటివ్ వచ్చినా.. ప్రభుత్వ లెక్కల్లో నెగెటివ్

కరోనా టెస్ట్ కోసం ప్రభుత్వ హాస్పిటల్ కు వెళితే.. పాజిటివ్ అని చెప్పి, టాబ్లెట్స్ ఇచ్చి పంపారని.. కానీ సెల్ ఫోన్ కు మెసేజ్ మాత్రం నెగెటివ్ అని వచ్చిందన్నారు.. నల్లగొండ జిల్లా మాడ్కులపల్లి మండలం కుక్కడం గ్రామానికి చెందిన బట్టు మాధవరెడ్డి. హెల్ప్ లైన్ కు ఫోన్ చేస్తే.. డాక్టర్ ను కలవాలని సూచించారన్నారు. డాక్టర్ దగ్గరికి వెళితే.. మీకు వచ్చింది పాజిటివ్ అయినా.. తాము సిస్టమ్ లో అప్లోడ్ చేసేటప్పుడు పాజిటివ్ అని కొట్టినా.. నెగెటివ్ గానే చూపిస్తుందని చెప్పారని తెలిపారు. బాధితులకు పాజిటివ్ వచ్చినా.. ప్రభుత్వ లెక్కల్లో నెగెటివ్ గా చూపుతూ.. తెలంగాణ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోందని ఆరోపించారు బట్టు మాధవరెడ్డి. తెలంగాణలో కరోనా పేషెంట్లు లేరని చెప్పేందుకే ఇలా ప్రభుత్వం మోసం చేస్తోందన్నారు. ప్రజలకు తప్పుడు సమాచారం ఇస్తూ.. కరోనా ప్రబలేందుకు.. ప్రజలు బలయ్యేందుకు కారణమౌతుందన్నారు. ప్రభుత్వం సెల్ ఫోన్లకు పంపే తప్పుడు సమాచారం నమ్మొద్దని సూచించారు బట్టు మాధవరెడ్డి.