గాంధీ ఎంసీహెచ్​లో మెట్లు, చెట్లే దిక్కు... కూర్చునేందుకు వెయిటింగ్​హాల్ ​కరువు

గాంధీ ఎంసీహెచ్​లో మెట్లు, చెట్లే దిక్కు... కూర్చునేందుకు వెయిటింగ్​హాల్ ​కరువు
  • గర్భిణులు, బాలింతలు,వారి సహాయకుల అవస్థలు

పద్మారావునగర్, వెలుగు: గాంధీ దవాఖానలోని ఎంసీహెచ్(మాతాశిశు సంరక్షణ కేంద్రం) ఆవరణలో వెయిటింగ్ హాల్​లేక గర్భిణులు, బాలింతలు, వారి సహాయకులు, అనారోగ్య సమస్యలతో వచ్చే మహిళలు అవస్థలు పడుతున్నారు. ఇక్కడికి వైద్య సేవల కోసం నిత్యం వందలాది మంది వస్తుంటారు. 

హాస్పిటల్​ ఆవరణలో తగినంత స్థలం ఉన్నప్పటికీ వారు కూర్చునేందుకు వెయిటింగ్ హాల్ కోసం కనీసం షెడ్డు కూడా నిర్మించలేదు. దీంతో దవాఖానా మెట్లపై, చెట్ల కింద కూర్చోవడం లేదా నిలబడడం చేస్తున్నారు. కనీస సౌకర్యాలైన వాష్ రూమ్స్, కుర్చీలు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొం టున్నారు. ఇప్పటికైనా వెయిటింగ్​హాల్, వాహనాల పార్కింగ్ కోసం షెడ్డు నిర్మించాలని కోరుతున్నారు.