పటోళ్ల గోవర్ధన్ రెడ్డి హత్య కేసులో తీర్పు..నిర్దోషిగా శేషన్న

పటోళ్ల గోవర్ధన్ రెడ్డి హత్య కేసులో తీర్పు..నిర్దోషిగా శేషన్న

పటోళ్ల గోవర్ధన్ రెడ్డి హత్య కేసులో నాంపల్లి కోర్టు తీర్పు వెల్లడించింది. ఈ కేసులో ప్రధాన ముద్దాయిగా ఉన్న మాజీ మావోయిస్టు శేషన్నను నిర్దోషిగా ప్రకటించింది కోర్టు. 11 సంవత్సరాల సుదీర్ఘ విచారణ తర్వాత మార్చి 24 శుక్రవారం నాంపల్లి కోర్టు తీర్పునిచ్చింది. 2012 డిసెంబర్ 27న పటోళ్ల గోవర్ధన్ రెడ్డిని గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. ఆటోలో మరో వ్యక్తితో కలిసి వెళ్తున్న పటోళ్ల గోవర్ధన్ రెడ్డిని దుండగులు దారుణంగా చంపేశారు.

హత్యపై సుల్తాన్ బజార్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఈ కేసులో మొత్తం 20 మంది నిందితులను ఆరెస్ట్ చేశారు. ఫిబ్రవరి 2018లో ప్రధాన నిందితుడిగా శేషన్న ను పోలీసులు ఆరెస్ట్ చేశారు. 11 ఏళ్ల సుదీర్ఘ విచారణ తర్వాత కోర్టు శేషన్నను నిర్దోషిగా ప్రకటించింది. నయీం ప్రధాన అనుచరుడిగా ఉన్న శేషన్నపై పలు కేసులు నమోదైన విషయం తెలిసిందే.