పెట్రోలింగ్ పోలీసుల దాడి.. కంటిచూపుపై ఎఫెక్ట్!

పెట్రోలింగ్ పోలీసుల దాడి.. కంటిచూపుపై ఎఫెక్ట్!
  • షాద్​నగర్​లో పీఎస్​లో బాధితుడు ఫిర్యాదు 

షాద్ నగర్, వెలుగు: పెట్రోలింగ్ పోలీసులు తనపై అకారణంగా దాడి చేశారని ఓ బాధితుడు ఆరోపించాడు. రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం ఇప్పలపల్లికి చెందిన వెంకటేశ్ (45) బోర్ మెకానిక్​గా పనిచేస్తున్నాడు. ఈ నెల 15న షాద్​నగర్​లోని శక్తి వైన్స్ ముందు నిలబడి ఉండగా, పెట్రోలింగ్ పోలీసులు బూతులు తిడుతూ విచక్షణారహితంగా కొట్టారని వాపోయాడు.

వైన్స్​లో పనిచేసే ఓ యువకుడు పోలీసు వాహనంలోకి ఏదో కవర్ ఇవ్వడం చూశానని దాడి చేశారని ఆరోపించాడు. అనంతరం పాత కిషన్ నగర్ రోడ్డులోని నిర్మానుష్య ప్రదేశంలోకి తీసుకెళ్లి ‘లొల్లి చేస్తే చంపేస్తాం’ అని బెదిరించి మొబైల్ పగులగొట్టి వదిలేసి వెళ్లిపోయారని చెప్పాడు.

తీవ్ర గాయాలతో నడుచుకుంటూ ఇంటికి చేరానని వెంకటేశ్ వాపోయాడు. ఈ ఘటనలో తన కంటిచూపు ఎఫెక్ట్​ అయ్యిందని బాధితుడు మంగళవారం షాద్​నగర్​పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేశాడు. తన తన తండ్రిని కొట్టిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని కొడుకు హేమంత్ కోరాడు.