
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan kalyan) ప్రధాన పాత్రలో వచ్చిన లేటెస్ట్ మూవీ బ్రో(Bro). సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్(Sai dharam tej) కీ రోల్లో కనిపించిన ఈ సినిమా జులై 28న ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని సాధించింది. తమిళ హిట్ మూవీ వినోదయ సీతం కు రీమేక్ గా వచ్చిన ఈ సినిమాను సముద్రఖని తెరకెక్కించారు.
తాజాగా ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ను అధికారికంగా ప్రకటించారు మేకర్స్. ఈ సినిమా ఓటీటీ హక్కులను ఇప్పటికే భారీ ధరకు నెట్‌ఫ్లిక్స్ సంస్థ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను ఆగస్టు 25 నుంచి స్ట్రీమింగ్ చేయనుంది నెట్‌ఫ్లిక్స్. దీంతో ఈ సినిమాను ఓటీటీలో చూసేందుకు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు ఆడియన్స్. మరి థియేటర్లో మిక్సుడ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమాకు.. ఓటీటీలో ఎలాంటి రిజల్ట్ రానుంది అనేది చూడాలి.
ఇక బ్రో సినిమా విషయానికి వస్తే.. కేతిక శర్మ, ప్రియా ప్రకాష్ వారియర్, రోహిని, వెన్నెల కిశోర్, బ్రహ్మానందం ముఖ్య పాత్రల్లో కనిపించిన ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్‌ప్లే, మాటలు అందించిన ఈ సినిమాకు.. తమన్ సంగీతం అందించారు.