OG Movie : పవన్‌ కల్యాణ్‌ అభిమానులకు అదిరిపోయే ఆప్డేట్ .. ఓజీ మూవీ ఫస్ట్ సింగల్ కి మూహుర్తం ఫిక్స్

OG Movie : పవన్‌ కల్యాణ్‌ అభిమానులకు అదిరిపోయే ఆప్డేట్ .. ఓజీ మూవీ ఫస్ట్ సింగల్ కి మూహుర్తం ఫిక్స్

బ్యాక్ టు బ్యాక్ షూటింగ్స్‌‌లో పాల్గొంటూ  కమిటైన చిత్రాలను ఒక్కొక్కటిగా పూర్తి చేస్తున్నారు పవన్ కళ్యాణ్. రీసెంట్‌‌గా ‘హరిహర వీరమల్లు’ రిలీజ్ కాగా, ఈ సెప్టెంబర్ 25న  ‘ఓజీ’ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తవడంతో  తాజాగా మ్యూజికల్ ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు మేకర్స్. ఆగస్టు 2న ఫస్ట్ సాంగ్‌‌ను రిలీజ్ చేయబోతున్నట్టు తెలియజేశారు.  ‘కోపంలో పుట్టి, పోరాటానికే సిద్ధమయ్యాడు. అతను చివరి పేజీ రాయడానికి తిరిగి వచ్చాడు. ఫైరింగ్ మూమెంట్’ అంటూ మొదటి పాట అప్‌‌డేట్ ఇచ్చారు. 

తమన్ కంపోజ్ చేసిన  ఈ పాటను శింబు పాడాడు.   కంప్లీట్ యాక్షన్ ఎంటర్‌‌‌‌టైనర్‌‌‌‌గా సుజీత్ రూపొందిస్తున్న ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ గ్యాంగ్‌‌స్టర్‌‌‌‌గా కనిపించనున్నారు.   ప్రియాంక మోహన్ హీరోయిన్‌‌గా నటిస్తోంది. ఇమ్రాన్ హష్మీ విలన్‌‌గా,  అర్జున్ దాస్, శ్రియా రెడ్డి, ప్రకాష్ రాజ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు.