
సినిమా హాళ్ల బంద్ వెనుక ఉన్న శక్తులేంటో విచారించాలన్నారు పవన్ కళ్యాణ్. దీని వెనుక జనసేన వాళ్ళు ఉన్నా చర్యలకు వెనుకాడొద్దని హెచ్చరించారు. త్వరలో విడుదలయ్యే తన సినిమా హరిహర వీరమల్లు అయినా సరే టికెట్ రేట్ల పెంపు కావాలంటే ఫిలిం ఛాంబర్ ద్వారానే ప్రభుత్వాన్ని సంప్రదించాలన్నారు. సినిమా హాళ్ల నిర్వహణ పకడ్బందీగా ఉండాలన్నారు. రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ ఎప్పటికప్పుడు సమన్వయం చేస్తుందన్నారు. థియేటర్లలో ఆహార పానీయాల క్వాలిటీ,రేట్స్ పై నియంత్రణలో ఉండాలన్నారు.
ఇటీవల డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు నిర్మాతలతో సమావేశమై తెలుగు రాష్ట్రాల్లో జూన్ 1 నుంచి సినిమ థియేటర్లు బంద్ చేస్తున్నారంటూ ప్రకటించారు . అయితే దీనిపై పవన్ సీరియస్ అయ్యారు. సినీ ఇండస్ట్రీ డెవలప్‌మెంట్ కోసం ఏపీ ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతున్నప్పటికీ, సినీ పరిశ్రమ సానుకూలంగా స్పందించడం లేదని, కనీస కృతజ్ఞత చూపించడం లేదని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం సినీ రంగం కోసం అనేక చర్యలు చేపడుతున్నప్పటికీ, థియేటర్ల బంద్ వంటి నిర్ణయాలు పరిశ్రమ, ప్రభుత్వం మధ్య గ్యాప్‌ను పెంచుతున్నాయని చెబుతూ ఓ నోట్ విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సినిమా ఇండస్ట్రీని అభివృద్ధి చేయాలని చూస్తుంటే.. సినీ రంగంలో ఉన్నవారు మాత్రం ఏపీ ప్రభుత్వం పట్ల కనీస మర్యాద, కృతజ్ఞత చూపించడం లేదన్నారు.
►ALSO READ | Khaleja4KFromMay30: అప్పుడేమో డిజాస్టర్.. ఇప్పుడు బ్లాక్బస్టర్.. రీ-రిలీజ్ టికెట్ సేల్స్లో ఖలేజా ట్రెండ్సెట్టర్ !
దీంతో జూన్ 1 నుంచి తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ల బంద్ లేదని తెలుగు ఫిలిం ఛాంబర్ మే 24న ప్రకటించింది. సినిమా ప్రదర్శనలు యధావిధిగా కొనసాగుతాయని ఫిలిం ఛాంబర్ సెక్రటరీ దామోదర ప్రసాద్ చెప్పారు. మే 24న డిస్ట్రిబ్యూటర్లు,ఎగ్జిబిటర్లతో నిర్మాతలు భేటీ అయ్యారు. అనంతరం మాట్లాడిన దామోదర ప్రసాద్.. సమస్యలపై మే 30న కమిటీ వేస్తున్నామని చెప్పారు.అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకున్నామన్నారు. ఇండస్ట్రీ కోసం కలిసి పనిచేయాల్సిందేననన్నారు.
పవన్ వ్యాఖ్యలపై నిర్మాత దిల్ రాజు, అల్లు అరవింద్ స్పందించి అసలు థియేటర్ల బంద్ తో తమకు సంబంధం లేదన్నారు. తెలుగు రాష్ట్రాల్లో 90 శాతం వరకు థియేటర్లు పర్సంటేజ్ రూపంలోనే నడుస్తున్నాయని దిల్ రాజ్ చెప్పారు. పవన్ సినిమాను ఆపే దమ్మూధైర్యం ఎవరికీ లేవన్నారు.