Champions Trophy 2025: టీమిండియా పాకిస్థాన్ వెళ్తుందా.. పీసీబీ కొత్త ఛైర్మన్ ఏమన్నాడంటే..?

Champions Trophy 2025: టీమిండియా పాకిస్థాన్ వెళ్తుందా.. పీసీబీ కొత్త ఛైర్మన్ ఏమన్నాడంటే..?

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా పాకిస్థాన్ కు వెళ్తుందా లేదనే విషయంలో సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. ఈ విషయంపై  పీసీబీ కొత్త చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ ఒక క్లారిటీ ఇవ్వనున్నాడని నివేదికలు చెబుతున్నాయి. వచ్చే వారం దుబాయ్‌లో ఐసీసీ మీటింగ్ జరగనుంది. ఈ సమావేశంలో 2025లో పాకిస్థాన్‌లో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ ఆడుతుందా లేదా అనే విషయం గురించి బీసీసీఐ సెక్రటరీ జైషాను మొహ్సిన్ నఖ్వీ అడగనున్నట్లు కొన్ని నివేదికలు తెలిపాయి.        

ఐసీసీ షెడ్యూల్ ప్రకారం.. పాకిస్తాన్ వేదికగా 2025 ఛాంపియన్స్‌ ట్రోఫీ జరగాల్సి ఉంది. ఇప్పటికే దీనిపై ఐసీసీ స్పష్టతనిచ్చింది. పాకిస్తాన్‌‌లోనే ఈ టోర్నీ నిర్వహిస్తామని తేల్చి చెప్పింది. అయితే బీసీసీఐ మాత్రం పాక్ ‌లో పర్యటించేది లేదని తెగేసి చెప్తోంది. సరిహద్దు సమస్యలు ఓ కొలిక్కి వచ్చేవరకూ దాయాది దేశానికి వెళ్లేది లేదని ఖరాకండిగా చెప్తోంది. దీంతో దాయాది క్రికెట్ బోర్డు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తోంది. భారత జట్టు లేకపోతే టోర్నీ కళ తప్పడమే కాకుండా, లాభాలలో భారీగా గండి పడే అవకాశం ఉండటంతో ప్రత్యామ్నాయ ఏర్పాట్ల వైపు ద్రుష్టి పెట్టింది. 

ALSO READ :- David Miller: ప్రేయసిని పెళ్లాడిన డేవిడ్ మిల్లర్.. ఫోటోలు వైరల్

2023 ఆసియా కప్ టోర్నీ సమయంలోనూ ఇరు దేశాల క్రికెట్ బోర్డుల మధ్య ఇదే గొడవ జరిగింది. పాక్ వేదికగా ఆసియా కప్‌ నిర్వహిస్తే భారత జట్టు పాల్గొనేది లేదని బీసీసీఐ తేల్చి చెప్పింది. దీంతో హైబ్రిడ్‌ మోడల్‌లో భారత్‌ మ్యాచ్‌లన్నీ శ్రీలంక వేదికగా జరిగాయి. అచ్చం 2025లో ఛాంపియన్స్‌ ట్రోఫీ కూడా అలానే జరుగనున్నట్లు తెలుస్తోంది. ఛాంపియన్స్‌ ట్రోఫీలో భారత్‌ ఆడబోయే మ్యాచ్‌లన్నీ దుబాయ్‌ వేదికగా జరుగుతాయని సమాచారం. మొత్తం టోర్నీని తరలించడం కంటే భారత్‌ మ్యాచ్‌లు మాత్రమే దుబాయ్‌లో నిర్వహిస్తే సరిపోతుందని పీసీబీ భావిస్తోందట.