కౌన్ బనేగా పీసీసీ చీఫ్ 

కౌన్ బనేగా పీసీసీ చీఫ్ 

రాష్ట్ర కాంగ్రెస్​లో మళ్లీ మొదలైన రేసు
 ఢిల్లీలో కొనసాగుతున్న కసరత్తు
 వారం, పది రోజుల్లో నియామకం పూర్తి!
 దక్కించుకునేందుకు పోటీ పడుతున్న నేతలు
 ఒకరిపై మరొకరి విమర్శలు, ఆరోపణలు
టీఆర్‌‌ఎస్‌‌కు, ఎమ్మెల్యే పదవికి ఈటల రాజీనామాతో 6 నెలల్లో బైపోల్‌‌

హైదరాబాద్, వెలుగు: మాజీ మంత్రి ఈటల రాజేందర్ ప్రాతినిధ్యం వహిస్తున్న కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ అసెంబ్లీకి త్వరలోనే ఉప ఎన్నిక జరిగే అవకాశం కనిపిస్తోంది. టీఆర్ఎస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు శుక్రవారం ఆయన ప్రకటించడంతో 6 నెలల్లో ఎప్పుడైనా ఆ నియోజకవర్గానికి ఎన్నిక జరగనుంది. ప్రత్యేక పరిస్థితుల్లో ఎలక్షన్ వస్తుండటంతో రాష్ట్ర రాజకీయాల చూపు హుజూరాబాద్‌‌పై పడింది. కేసీఆర్‌‌కు కుడి భుజంగా ఉన్న ఈటల మంత్రి వర్గం నుంచి బర్తరఫ్‌‌ కావడం, వెంటనే బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో ఆయన సమావేశమై పార్టీలో చేరేందుకు ముహూర్తం ఖరారు చేసుకోవడం, ఎమ్మెల్యే పదవికి, టీఆర్‌‌ఎస్‌‌కు సభ్యత్వానికి రాజీనామా చేసి ప్రజా తీర్పు కోసం సిద్ధమవడం రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తి రేపింది. వచ్చే వారం బీజేపీలో చేరనున్న ఈటల.. కమలం పార్టీ తరఫున ఎన్నికల బరిలో దిగనున్నారు. 
టీఆర్‌‌ఎస్‌‌, బీజేపీలకు కీలకం
అటు టీఆర్ఎస్‌‌కు, ఇటు బీజేపీకి ఈ ఎన్నిక కీలకం కానుంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తున్న బీజేపీకి ఈ ఎన్నిక కలిసి రానుంది. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌‌ కుమార్ రెడ్డి చాలా రోజుల కిందటే తన పదవికి రాజీనామా చేశారు. తన స్థానంలో ఎవరినైనా నియమించమని అధిష్టానానికి లెటర్ రాశారు. పీసీసీ చీఫ్ పదవి కోసం దాదాపు డజను మంది నాయకులు పోటీ పడుతున్నారు. క్యాస్ట్ ఈక్వెషన్ పాటించి బీసీలకు ఇవ్వాలని కొందరు నేతలు డిమాండ్ చేస్తుండగా.. మరికొందరు మాత్రం ఎస్సీలకు ఇవ్వాలని అడుగుతున్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, ఎమ్మెల్సీ టి.జీవన్రెడ్డి, మాజీ మంత్రులు శ్రీధర్ బాబు, దామోదర రాజనర్సింహ పేర్లు పీసీసీ పదవికి ప్రముఖంగా వినిపించాయి. తాము రేసులో ఉన్నట్లు ఎమ్మెల్యే జగ్గారెడ్డి, వీహెచ్ కూడా ప్రకటించారు. ఈ పోటీలో భాగంగా నేతలు విమర్శలు, ప్రతి విమర్శలకు దిగి.. ఒక దశలో పార్టీ పరువు తీసేంత పని చేశారు. దీంతో అప్పట్లో కొత్తగా వచ్చిన రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జి మాణిక్కం ఠాగూర్ జోక్యం చేసుకొని ఎవరూ పీసీసీ అధ్యక్ష పదవి గురించి బహిరంగంగా మాట్లాడొద్దని ఆదేశించాల్సి వచ్చింది.

ప్రాసెస్ మొదలైంది

కరోనా నియంత్రణ, వ్యాక్సినేషన్‌‌పై దేశవ్యాప్త కార్యక్రమాలు చేపట్టాలని పీసీసీలకు ఏఐసీసీ సూచనలిచ్చింది. దీంతో నేతలంతా మళ్లీ జనంలోకి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. అదే టైమ్‌‌లో మళ్లీ పీసీసీ అధ్యక్ష పదవిపై చర్చ మొదలైంది. కాంగ్రెస్ హైకమాండ్ కూడా రాష్ట్రాలపై దృష్టి సారించాలని భావించింది. తెలంగాణతో పాటు అస్సాం, తమిళనాడు, గుజరాత్, పశ్చిమబెంగాల్, కేరళ, పంజాబ్‌‌లకు కొత్త పీసీసీ అధ్యక్షులను నియమించే ప్రక్రియను హైకమాండ్ మొదలుపెట్టినట్లు ఏఐసీసీ కార్యదర్శి ఒకరు తెలిపారు. ‘‘గురువారం కొందరు జనరల్ సెక్రటరీలు, మైనార్టీ సెల్ చైర్మన్‌‌ను  హైకమాండ్ నియమించింది. అంటే ఎక్సర్‌‌సైజ్ మొదలైంది. ఆయా రాష్ట్రాల పరిస్థితులు, ఈక్వెషన్లను బట్టి ఒక్కో స్టేట్‌‌కు సంబంధించి నిర్ణయం ఉంటుంది. ఈ క్రమంలో ఏ రోజైనా తెలంగాణ పీసీసీ ప్రెసిడెంట్ నిర్ణయం రావచ్చు’’అని చెప్పారు.
అప్పుడే రేవంత్ పై కత్తులు
రేవంత్ రెడ్డికే పీసీసీ అధ్యక్ష పదవి దక్కుతుందని నాలుగు రోజుల నుంచి పార్టీలో ప్రచారం ఊపందుకుంది. దాంతో మరోసారి పార్టీలో నేతల మధ్య విబేధాలు బయటపడుతున్నాయి. రేవంత్‌‌ను ముందు నుంచి వ్యతిరేకిస్తున్న జగ్గారెడ్డి.. రెండు రోజుల క్రితం తానూ పీసీసీ రేసులో ఉన్నట్లు మీడియాకు తెలిపారు. రేవంత్ నియామకాన్ని వ్యతిరేకించిన సీనియర్ నేత వీహెచ్‌‌కు ఫోన్ లో బెదిరింపులు మొదలయ్యాయి. దాంతో ఆయన గురువారం ప్రెస్మీట్ పెట్టి రేవంత్ మీద సీరియస్ అయ్యారు. ‘‘ఆయన పార్టీలోకి వచ్చి ఏం చేసిండు. ఆయన అడుగుపెట్టిన ప్రతి చోట పార్టీ ఓటమి పాలైంది. ఏం మొహం పెట్టుకొని ఆయన పీసీసీ పదవి ఆశిస్తున్నారు’’అని విమర్శించారు. ఈ వ్యవహారం ఇలా నడస్తుండగానే రేవంత్కు అనుకూలంగా కొందరు, వ్యతిరేకంగా కొందరు ఢిల్లీకి ఫోన్లు చేస్తున్నారు. ఈ గొడవతో విసిగిపోయిన కొందరు లీడర్లు.. ఎవరో ఒకరికి పదవి అనౌన్స్ చేసి వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టాలని హైకమాండ్ను కోరుతున్నారు.

హైకమాండ్ కు పేర్లు
పీసీసీ చీఫ్‌‌ ఎంపిక కోసం రాష్ట్రంలో అభిప్రాయ సేకరణను మాణిక్కం ఠాగూర్ మొదలుపెట్టారు. గాంధీభవన్‌‌లో మూడ్రోజులపాటు కసరత్తు చేశారు. సీనియర్లు, కోర్ కమిటీ మెంబర్లు, నియోజకవర్గ ఇన్‌‌చార్జిలు, డీసీసీ అధ్యక్షుల అభిప్రాయాలు స్వీకరించారు. వచ్చిన పేర్లలో కొన్నింటిని హైకమాండ్ కు పంపారు. ఐదారుగురి పేర్లను పెద్దల పరిశీలనకు పంపినట్లు అప్పట్లో ఆయనే చెప్పారు. చివరి వడపోతలో జీవన్ రెడ్డి, రేవంత్‌‌రెడ్డి పేర్లు బలంగా వినిపించాయి. వీరిద్దరిలో ఎవరో ఒకరికి పదవి దక్కుతుందనే ప్రచారం జోరుగా సాగింది. ఇదే సమయంలో నాగార్జున సాగర్ ఉప ఎన్నిక వచ్చింది. అక్కడి నుంచి పోటీ చేస్తున్న సీనియర్ నేత జానారెడ్డి.. పీసీసీ ప్రెసిడెంట్ ఎంపికను ఎన్నికలు పూర్తయ్యే వరకు వాయిదా వేయాలని హైకమాండ్‌‌కు లెటర్ రాశారు. ఇలాంటి ప్రకటనల ప్రభావం తన ఎలక్షన్లపై పడుతుందని చెప్పారు. దాంతో అధిష్టానం పీసీసీ చీఫ్ ఎంపికను వాయిదా వేసింది. నేతలందరూ ఏకమై సాగర్ ఎన్నికల ప్రచారంలోకి దిగారు. అక్కడ జానారెడ్డి ఓడిపోవడంతో అందరూ సైలెంట్ అయిపోయారు.